రామ్ దగ్గరికి వెళ్లిన బన్నీ 'ఐకాన్' కథ!

  • రామ్ హీరోగా 'ది వారియర్'
  • ముగింపు దశలో ఉన్న సినిమా 
  • తరువాత ప్రాజెక్టు బోయపాటితో
  • లైన్లో వేణు శ్రీరామ్ సినిమా 
వేణు శ్రీరామ్ - దిల్ రాజు 'ఐకాన్' సినిమాను బన్నీతో చేయాలనుకున్నారు. ఆరంభంలో ఈ ప్రాజెక్టు చేయడానికి ఆసక్తిని చూపిన బన్నీ, ఆ తరువాత ఎందుకనో అంతగా దృష్టిపెట్టలేదు. ఆయనను లైన్లో పెట్టడానికి దిల్ రాజు ఎంతగా ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. ఆ తరువాత ఆయన 'పుష్ప' కూడా చేయడం జరిగిపోయింది.

ప్రస్తుతం బన్నీ 'పుష్ప 2' చేయడానికి రెడీ అవుతున్నాడు. ఆ తరువాత బోయపాటి ప్రాజెక్టు సిద్ధంగా ఉంది. అందువలన ఇప్పట్లో బన్నీ 'ఐకాన్' చేసే ఆలోచనలో లేనట్టుగా తెలిసిపోతోంది. దాంతో ఈ కథను రామ్ తో చేస్తే బాగుంటుందని భావించి, ఇటీవల ఆయనకి వినిపించారట. ఈ కథపైనే కసరత్తు జరుగుతోందని అంటున్నారు. 

రామ్ తాజా చిత్రంగా 'ది వారియర్' నిర్మితమవుతోంది. లింగుస్వామి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆ తరువాత సినిమా బోయపాటి దర్శకత్వంలో ఉంది. అది కూడా పూర్తయిన తరువాత రామ్ 'ఐకాన్' చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమాను స్రవంతి - దిల్ రాజు బ్యానర్లు కలిసి నిర్మిస్తాయని చెబుతున్నారు.


More Telugu News