ఉక్రెయిన్​పై మొత్తం 480 క్షిప‌ణులు​ ప్రయోగించిన రష్యా

  • వివ‌రాలు వెల్ల‌డించిన అమెరికా
  • 230 క్షిప‌ణుల‌ను ఉక్రెయిన్లోని మొబైల్స్ వ్యవస్థల ద్వారా ప్ర‌యోగం
  • 150 రష్యా భూభాగం నుంచి..
  • 70 బెలారస్ నుంచి, మ‌రికొన్నింటిని నల్ల సముద్రం నుంచి
ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడులు తీవ్ర‌త‌రం చేసిన విష‌యం తెలిసిందే. ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవ‌డానికి ముందస్తుగానే అన్ని ర‌కాలుగా ప్ర‌ణాళిక‌లు రూపొందించుకున్న అమెరికా క్షిప‌ణులనూ భారీ మొత్తంలో ప్ర‌యోగిస్తోంది. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 470 క్షిపణులు ప్రయోగించినట్లు అమెరికా ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

వాటిలో 230 ఉక్రెయిన్లోని మొబైల్స్ వ్యవస్థల ద్వారా, 150 రష్యా భూభాగం నుంచి, 70 బెలారస్ నుంచి, మ‌రికొన్నింటిని నల్ల సముద్రంలోని నౌకల ద్వారా ర‌ష్యా ప్రయోగించినట్లు తెలిపింది. వాటిని ఉక్రెయిన్ లోని క్షిపణి విధ్వంసక దళాలు ఎదుర్కొనే ప్ర‌య‌త్నం చేశాయ‌ని చెప్పింది. ర‌ష్యా సేన‌లు ఉక్రెయిన్ దక్షిణ ప్రాంతంలో దాడుల‌కు తెగ‌బ‌డుతూ దూసుకుపోతున్న‌ప్ప‌టికీ ఉత్తర ప్రాంతంలో మాత్రం ఎదురు దెబ్బ‌లు తింటున్నార‌ని అమెరికా తెలిపింది. ఆ ప్రాంతంలో ఉక్రెయిన్ సేన‌లు బ‌లంగా ఉండ‌డంతో ప్రతిఘటన ఎదుర‌వుతోంద‌ని వివ‌రించింది.


More Telugu News