నో ఫ్లై జోన్ కోసం ఉక్రెయిన్ ఎందుకు పట్టుబడుతోంది?.. అమెరికా ఎందుకు కాదంటోంది?

  • నో ఫ్లైజోన్ తో ఉక్రెయిన్ కు మరిన్ని అధికారాలు
  • రష్యా విమానాలను కూల్చేయవచ్చు
  • అమెరికా, నాటో దేశాలు కూడా ఈ పనిచేయాల్సి వస్తుంది
  • అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం
  • అందుకే ఉక్రెయిన్ వినతికి తిరస్కరణ
రష్యా దాడులను గట్టిగా తిప్పికొడుతున్న ఉక్రెయిన్.. మరింత పైచేయి సాధించేందుకు వీలుగా ‘నో ఫ్లై జోన్’ కోసం డిమాండ్ చేస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.. ఉక్రెయిన్ గగనతలాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని అమెరికాతోపాటు, నాటో సభ్య దేశాలను కోరారు. దీన్ని ఆయా దేశాలు తిరస్కరించాయి.

నో ఫ్లై జోన్ అంటే?
సైనిక శక్తిని వినియోగిస్తున్న ప్రాంతంలో ఇతర విమానాల రాకపోకలను అనుమతించకపోవడం. యుద్ధ సమయాల్లో శుత్రుదేశాలు విమానాలతో దాడులకు దిగకుండా రక్షణగా నో ఫ్లై జోన్ ప్రకటిస్తుంటారు. ఉక్రెయిన్ గగనతలాన్ని మూసివేయడం తెలిసిందే. కానీ, గగనతలాన్ని మూసివేయడానికి, నో ఫ్లై జోన్ కు మధ్య వ్యత్యాసం ఉంది. నో ఫ్లై జోన్ అమల్లోకి వస్తే.. ఆ దేశ గగనతంలోకి ప్రవేశించిన శుత్రదేశ విమానాలను కూల్చేయవచ్చు. 

పాశ్చాత్య దేశాలు వ్యతిరేకం
ఉక్రెయిన్ వినతిని అమెరికా, నాటో దేశాలు తిరస్కరించడం వెనుక బలమైన కారణాలే ఉన్నాయి. నో ఫ్లై జోన్ ప్రకటిస్తే.. అప్పుడు రష్యా విమానాలను ఉక్రెయిన్ కూల్చివేస్తుంది. అంతేకాదు, నో ఫ్లై జోన్ ప్రకటించిన దేశాలు కూడా రష్యా యుద్ధ విమానాలను కూల్చేయాల్సి వస్తుంది. నో ఫ్లై జోన్ అంటే దానిని విధించే దేశాలు క్షేత్రస్థాయిలోని ఆయుధాలను అధీనంలోకి తీసుకోవాలి. అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధానికి ఆహ్వానం పలికినట్టవుతుంది. కానీ, పాశ్చాత్య దేశాలు రష్యాతో ప్రత్యక్ష యుద్ధానికి సుముఖంగా లేవు. అందుకనే ఉక్రెయిన్ వినతిని తిరస్కరించాయి. 

అమెరికా గతంలో లిబియా, ఇరాక్, బోస్నియాలో నో ఫ్లై జోన్ విధించిన సందర్భాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడు ఉక్రెయిన్ విషయంలో పరిస్థితి వేరు. రష్యా వద్ధ అత్యాధునిక అణ్వాయుధాలున్నాయి.


More Telugu News