కేంద్రమంత్రితో కలిసి జగన్ పోలవరం పర్యటన
- ముందుగా దేవీపట్నం మండలం ఇందుకూరు-1లో పర్యటన
- అక్కడి పునరావాస కాలనీలో ప్రజలతో మాటామంతీ
- సమస్యలు చెప్పుకున్న పోలవరం నిర్వాసితులు
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కలిసి ఏపీ సీఎం వైఎస్ జగన్ పోలవరం ప్రాజెక్టు వద్ద పర్యటిస్తున్నారు. ముందుగా దేవీపట్నం మండలం ఇందుకూరు-1కు వారు చేరుకున్నారు. అక్కడి పునరావాస కాలనీలో ప్రజలతో వారు మాట్లాడుతున్నారు. పోలవరం నిర్వాసితులు తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. పునరావాస కాలనీలో అన్ని వసతులు కల్పించినట్లు కేంద్ర మంత్రి షెకావత్ అన్నారు.
పోలవరం పూర్తి చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, తాను మరోసారి కూడా ఇక్కడ పర్యటిస్తానని ఆయన చెప్పారు. నిర్వాసితులతో మాట్లాడిన అనంతరం ప్రాజెక్టు పనులు పరిశీలిస్తారు. అనంతరం అధికారులతో సమావేశమై కొనసాగుతోన్న పనులపై చర్చలు జరుపుతారు.
కాగా, దేవీపట్నం మండలం ఏనుగుల పల్లి, మంటూరు, అగ్రహారం గ్రామాల వారి కోసం ఇందుకూరు -1 కాలనీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రి షెకావత్, సీఎం జగన్‌తో పాటు ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ పర్యటనలో పాల్గొంటున్నారు.