‘స్టార్‌వార్స్’ నిర్మాత అలన్ లాడ్ కన్నుమూత
- కథలను ఎంపిక చేయడంలో దిట్టగా పేరుగాంచిన ‘లడ్డీ’
- ఆయన నిర్మించిన బ్రేవ్‌హార్ట్ సినిమా ఉత్తమ చిత్రంగా ఎంపిక
- 50కిపైగా పురస్కారాలు, 150 నామినేషన్లు
- లడ్డీ మృతి ప్రపంచ సినిమాకు తీరని లోటన్న హాలీవుడ్
ప్రముఖ హాలీవుడ్ నిర్మాత, ఆస్కార్ విజేత అయిన అలన్ లాడ్ జూనియర్ కన్నుమూశారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. ఉత్తమ కథలను ఎంపిక చేయడంలో తనకంటూ ప్రత్యేకత సాధించిన ఆయన ఎంపిక చేసిన కథలు తెరకెక్కి 50కిపైగా ఆస్కార్ పురస్కారాలు, 150 నామినేషన్లు అందుకున్నాయి. ఫాక్స్‌స్టార్, ట్వంటీయత్ సెంచరీ ఫాక్స్, ఎంజీఎం లాంటి అగ్ర నిర్మాణ సంస్థల్లో లాడ్ ఎగ్జిక్యూటివ్‌గానూ పనిచేశారు. నిర్మాతగా ఆయన తెరకెక్కించిన ‘బ్రేవ్ హార్ట్’ సినిమా ఉత్తమ ఆస్కార్ చిత్రంగా తెరకెక్కింది.
అలన్ లాడ్ తండ్రి కూడా సినిమాల్లోనే పనిచేశారు. తొలుత స్టంట్ మ్యాన్‌గా పనిచేశారు. ఆ తర్వాత సినీ వ్యాపారంలోకి ప్రవేశించారు. దీనిని అలన్ లాడ్ ఆ తర్వాత కొనసాగించారు. లాడ్‌ను హాలీవుడ్‌లో ముద్దుగా లడ్డీ అని పిలుకునేవారు. తన కెరియర్‌లో మరపురాని అనేక చిత్రాలను ప్రేక్షకులకు అందించారు.
అలాంటి వాటిలో యంగ్ ఫ్రాంకెన్‌స్టీన్, ది రాకీ హర్రర్ పిక్చర్ షో, చారియట్స్ ఆఫ్ ఫైర్, బ్రేడ్ రన్నర్ వంటివి ఉన్నాయి. అలాగే, వన్స్ అపానే టైమ్ ఇన్ అమెరికా, ది రైట్ స్టఫ్, గోన్ బేబీ బోన్, బ్రేవ్‌హార్ట్ వంటి చిత్రాలను సొంతంగా నిర్మించారు. బ్రేవ్‌హార్ట్ ఉత్తమ సినిమాగా ఆస్కార్ అవార్డు అందుకుంది. అలన్ లాడ్ మృతి ప్రపంచ సినిమాకు తీరని లోటని హాలీవుడ్ పేర్కొంది.