ఆ దాడులకు స్క్రీన్ ప్లే మొత్తం కేసీఆర్‌దే: బండి సంజయ్
- పోలీసుల తీరుపై బండి సంజయ్ విమర్శలు
- సీఎంకు కొమ్ము కాస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు
- రిలీజ్‌కు ముందే సినిమా అడ్డం తిరిగిందని ఎద్దేవా
మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిన వ్యవహారం అంతా అనుకున్నట్లుగా.. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీల మధ్య విభేదాలకు మరింత ఆజ్యం పోసిందనే చెప్పాలి. కుట్రలో బీజేపీ సీనియర్ నేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డిల పాత్రపై విచారిస్తామంటూ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర చెప్పిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే బీజేపీ, టీఆర్ఎస్‌ల మధ్య మాటల తూటాలు మొదలయ్యాయి. తాజాగా గురువారం నాడు డీకే అరుణ, జితేందర్ రెడ్డిల నివాసాలపై టీఆర్ఎస్ శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడ్డాయి.
ఈ దాడులపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తనదైన శైలిలో ఫైరయ్యారు. డీకే అరుణ నివాసంపై దుండగుల రాళ్ల దాడికి కథ, స్క్రీన్‌ప్లే అంతా సీఎం ఆఫీస్ నుండే జరిగిందని సంజయ్ ఆరోపించారు. సినిమా రిలీజ్ కాకా ముందే కథ అడ్డం తిరిగిందన్న సంజయ్... కొందరు ఐపీఎస్ అధికారుల తీరును చూసి కింది స్థాయి పోలీసులు అసహ్యించుకుంటున్నారన్నారు.
కొందరు అధికారులు సీఎంకి కొమ్ముకాస్తూ చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, నిన్న జరిగిన ఘటనకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ బలి అవుతారు.. వారిని సీఎం కాపాడుతారా? అని ఆయన అన్నారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డిలపై తప్పుడు కథనాలు రావడం బాధాకరమని బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు.