చ‌ర్చ‌లు చ‌ర్చ‌లే.. దాడులు దాడులే: ర‌ష్యా తొండి వాద‌న‌

  • త‌మ కండీష‌న్ల‌ను ఉక్రెయిన్ ఒప్పుకోవాల‌ని ప‌ట్టు
  • అప్పుడే యుద్ధం ఆగుతుందని ప్ర‌క‌ట‌న‌
  • ఉక్రెయిన్ డిమాండ్ల‌పై నోరు విప్ప‌ని ర‌ష్యా
యుద్ధంలో త‌ల‌ప‌డుతున్న రెండు వ‌ర్గాలు చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మైతే.. ఆ వ‌ర్గాలు ఇక యుద్ధం ఆపే దిశ‌గా ప‌య‌నిస్తున్నాయ‌నే భావ‌నే వ్య‌క్త‌మ‌వుతుంది. అయితే ఉక్రెయిన్‌పై యుద్ధంలో ర‌ష్యా వైఖ‌రి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంద‌నే చెప్పాలి. ఉక్రెయిన్ పై ఏకధాటిగా 8 రోజులుగా భీక‌ర యుద్ధం సాగిస్తున్న ర‌ష్యా.. యుద్ధం మొద‌లెట్టిన రెండో రోజే చ‌ర్చ‌లంటూ ప్ర‌తిపాద‌న చేసింది. దీంతో త్వ‌ర‌లోనే యుద్ధం ముగిసిపోనుంద‌న్న వాద‌న‌లు వినిపించాయి. అయితే తొలి విడ‌త చ‌ర్చ‌లు అసంపూర్తిగానే ముగియ‌గా.. గురువారం నాడు రెండో విడ‌త చ‌ర్చ‌ల‌కు ఇరు దేశాలు కూర్చున్నాయి.

ఇలాంటి కీల‌క త‌రుణంలో ర‌ష్యా త‌న తొండి వాద‌న‌నే మ‌ళ్లీ వినిపించింది. త‌మ్ముడు త‌మ్ముడే.. పేకాట పేకాటే అన్న చందంగా చ‌ర్చ‌లు చ‌ర్చ‌లే.. దాడులు దాడులే అంటూ త‌న యుద్ధోన్మాదాన్ని మ‌రోమారు బ‌య‌ట‌పెట్టుకుంది. యుద్ధం ఆపాలంటే ముందుగా తాము ప్ర‌తిపాదించిన ష‌ర‌తుల‌కు ఉక్రెయిన్ అంగీక‌రించి తీరాల్సిందేన‌ని కూడా ర‌ష్యా తేల్చి చెప్పింది. చ‌ర్చ‌ల్లో ఉక్రెయిన్ ప్ర‌స్తావించిన అంశాల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోని ర‌ష్యా.. ముందుగా త‌మ డిమాండ్ల‌నే ఒప్పుకోవాలంటూ ప‌ట్టుబ‌ట్ట‌డం చూస్తుంటే..ఉక్రెయిన్ దిగి వ‌చ్చేదాకా యుద్ధం ఆగ‌దేమోన‌న్న భ‌యాలు వ్యక్త‌మ‌వుతున్నాయి.


More Telugu News