ఉక్రెయిన్‌పై యుద్ధంతో రష్యాకు జరిగిన నష్టమెంత?
- 498 మంది సైనికుల మృతి
- 2,870 మంది ఉక్రెయిన్ సైనికులు, పౌరులను చంపేశాం
- 30 యుద్ధ విమానాలను కోల్పోయాం
- 217 యుద్ధ ట్యాంకులనూ ఉక్రెయిన్ ధ్వంసం చేసిందన్న రష్యా
ఉక్రెయిన్‌ను తమ వశం చేసుకునేందుకు యుద్ధోన్మాదంతో కదిలిన రష్యాకు ఆ యుద్దంలో భారీగానే నష్టం వాటిల్లింది. ఉక్రెయిన్ సాధనా సంపత్తిని తక్కువగా అంచనా వేసిన రష్యా ఎక్కడికక్కడ ఘోరంగానే దెబ్బ తింటోన్న సంగతి తెలిసిందే. అయితే యుద్ధంలో తమకు జరిగిన నష్టంపై ఇప్పటిదాకా పెదవి విప్పని రష్యా గురువారం నాడు యుద్ధంలో ఇప్పటిదాకా తమకు జరిగిన నష్టమిదేనంటూ ఓ కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఆధారంగా రష్యాకు యుద్ధంలో ఉక్రెయిన్ షాకిచ్చిందనే చెప్పక తప్పదు.
యుద్ధం మూలంగా 1,600 మంది రష్యా సైనికులు గాయపడ్డారట. 217 యుద్ధ ట్యాంక్‌లు, 90 ఫిరంగులు, 31 హెలికాప్టర్ల ఉక్రెయిన్ ధ్వంసం చేసిందట. 30 యుద్ధ విమానాలను కూడా ఉక్రెయిన్ కూల్చేసిందని రష్యా తన ప్రకటనలో తెలిపింది. ఈ యుద్ధంలో 498 మంది సైనికుల్ని కోల్పోయామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు 2,870 మంది ఉక్రెయిన్ సైనికులు, పౌరులను హతమార్చామని రష్యా ఒప్పుకుంది. ఓ వైపు ఉక్రెయిన్‌తో రెండో విడత చర్చలు జరుగుతున్న సమయంలోనే రష్యా నుంచి ఈ ప్రకటన వెలువడటం గమనార్హం.