ఈ టెస్టు కోహ్లీకి ప్రత్యేకంగా మిగిలిపోయేలా చేస్తాం: రోహిత్ శర్మ

  • ఏ క్రికెటర్ అయినా 100 టెస్టులు ఆడటం సామాన్య విషయం కాదు
  • కెరీర్లో కోహ్లీ ఎంతో దూరం పయనించాడు
  • జట్టు ఈ స్థాయిలో ఉండటానికి కోహ్లీనే కారణం
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వందో టెస్టు ఆడబోతున్నాడు. శ్రీలంకతో జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఆయనకు వందో టెస్టు కానుంది. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ, కోహ్లీకి ఈ టెస్టు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తామని చెప్పాడు. ఏ క్రికెటర్ అయినా వంద టెస్టులు ఆడటం సాధారణ విషయం కాదని... తన కెరీర్ లో కోహ్లీ ఎంతో దూరం పయనించాడని కొనియాడాడు. టెస్టుల్లో కోహ్లీ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడని చెప్పాడు. టీమిండియా ఇప్పుడు ఈ స్థాయిలో ఉండటానికి తన వంతుగా ఎన్నో మార్పులు తెచ్చాడని అన్నాడు. 

కోహ్లీకి తన వందో టెస్టు ఒక ప్రత్యేకమైన మ్యాచ్ గా మిగిలిపోయేలా చేయాలనుకుంటున్నామని చెప్పాడు. ఈ మ్యాచ్ పూర్తిగా ఐదు రోజుల పాటు కొనసాగేలా చేయాలనుకుంటున్నామని తెలిపాడు. జట్టు ఈ స్థాయిలో ఉండటానికి కోహ్లీనే కారణమని చెప్పాడు. ఇక్కడి నుంచి జట్టును తాను మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని అన్నాడు. తప్పులను సరిదిద్దుకుంటూ ముందుకు సాగాలనుకుంటున్నామని చెప్పాడు.


More Telugu News