అవ‌స‌ర‌మైతే నేనూ అమ‌రావ‌తి పోరులోకి దిగుతా: రేణుకా చౌద‌రి

  • అమ‌రావ‌తిపై హైకోర్టు తీర్పును స్వాగ‌తించిన మాజీ ఎంపీ
  • రాజ‌ధాని కోసం రైతులు నిస్వార్థంగా పోరాడారని కితాబు
  • ప్ర‌జాస్వామ్యం ముందు అంద‌రూ త‌లొగ్గాల్సిందేన‌ని వ్యాఖ్య 
ఏపీ రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో 800 రోజుల‌కు పైగా నిర్విరామంగా ఉద్య‌మం సాగిస్తున్న రాజ‌ధాని రైతులు హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు. అదే స‌మ‌యంలో రైతుల ఉద్య‌మానికి మ‌ద్ద‌తు ప‌లికిన వారు కూడా కోర్టు తీర్పుపై త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

ఇందులో భాగంగానే.. ఏపీతో ఏమాత్రం సంబంధం లేకున్నా.. అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మానికి సంపూర్ణ మ‌ద్ద‌తు ప‌లికిన తెలంగాణ‌కు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత రేణుకా చౌద‌రి కోర్టు తీర్పుపై స్పందించారు. రాజ‌ధానిని అమ‌రావ‌తిలోనే కొన‌సాగించాలంటూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో అయినా జ‌గ‌న్ స‌ర్కారు క‌ళ్లు తెర‌వాల‌ని రేణుకా చౌద‌రి వ్యాఖ్యానించారు. 

ఈ సంద‌ర్భంగా వంద‌ల రోజులు గ‌డుస్తున్నా.. ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌కుండా ఉద్య‌మాన్ని కొన‌సాగిస్తూ వ‌చ్చిన అమ‌రావతి రైతుల‌కు ఆమె స‌లాం చేశారు. అమ‌రావ‌తి కోసం రైతులు నిస్వార్థంగా ఉద్య‌మం చేశార‌ని..ఒక‌వేళ రైతులు మళ్లీ పోరాడాల్సి వ‌స్తే.. తానూ పోరాటంలోకి దిగుతాన‌ని ఆమె ప్ర‌క‌టించారు. ప్ర‌జాస్వామ్యం ముందు అంద‌రూ త‌లొగ్గాల్సిందేన‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికైనా వైసీపీ స‌ర్కారు గుర్తెర‌గాల‌ని కూడా కోరారు.


More Telugu News