ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు: హైకోర్టు తీర్పుపై బొత్స అసహనం

  • రాజధానిపై చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదన్న హైకోర్టు
  • అసెంబ్లీ ఉన్నదే చట్టాలు చేయడానికన్న బొత్స
  • తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులని స్పష్టీకరణ

ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని ఏపీ హైకోర్టు కీలక తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లోగా మాస్టర్ ప్లాన్ ను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని... లేని అధికారాలతో చట్టాన్ని రద్దు చేయలేరని స్పష్టం చేసింది. 

కోర్టు తీర్పు అధికార పార్టీ నేతలను షాక్ కు గురిచేసింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ, అసెంబ్లీ, పార్లమెంటు ఉన్నవే చట్టాలు చేయడానికని అన్నారు. ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని చెప్పారు. తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులని అన్నారు. తాము సమాజం కోసం ఆలోచన చేస్తుంటే, టీడీపీ తమ సామాజికవర్గం కోసం ఆలోచిస్తుందని విమర్శించారు.


More Telugu News