100వ టెస్టు ఆడతానని నేనెప్పుడూ అనుకోలేదు: విరాట్ కోహ్లీ

  • అరుదైన మైలురాయి ముంగిట కోహ్లీ
  • రేపు మొహాలీలో భారత్, శ్రీలంక తొలి టెస్టు
  • 100వ టెస్టు ఆడుతున్న కోహ్లీ
  • కోహ్లీపై శుభాకాంక్షల వెల్లువ
టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అరుదైన ఘనత ముంగిట నిలిచాడు. కెహ్లీ తన కెరీర్ లో 100వ టెస్టు ఆడబోతున్నాడు. రేపు టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మొహాలీలో ప్రారంభమయ్యే టెస్టు కోహ్లీకి 100వ టెస్టు మ్యాచ్. ఓ విశిష్టమైన మైలురాయి కావడంతో కోహ్లీపై శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. వందో టెస్టులో సెంచరీ సాధించి చిరస్మరణీయం చేసుకోవాలంటూ సునీల్ గవాస్కర్ వంటి దిగ్గజాలు ఆకాంక్షిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో, కోహ్లీ మాట్లాడుతూ, అసలు 100 టెస్టులు ఆడతానని తానెప్పుడూ అనుకోలేదని వెల్లడించాడు. ఇది ఎంతో సుదీర్ఘమైన ప్రస్థానం అని పేర్కొన్నాడు. 100 టెస్టుల వరకు వచ్చానంటే ఎంతో గొప్పగా అనిపిస్తోందని వివరించాడు. 

దేవుడి దయ, ఫిట్ నెస్ కోసం తాను పడిన కష్టం... ఇలా అనేక అంశాలు తోడ్పాటు అందించాయని పేర్కొన్నాడు. ఇది తనకే కాకుండా, తన కుటుంబం, కోచ్ కూడా ఎంతో సంతోషించే సమయం అని కోహ్లీ అభిప్రాయపడ్డాడు.


More Telugu News