అతిపెద్ద స్క్రీన్ పై 'ఆర్ ఆర్ ఆర్' ఆవిష్కరణ!
- రాజమౌళి నుంచి 'ఆర్ ఆర్ ఆర్'
- చారిత్రక నేపథ్యంలో సాగే కథ
- యూకేలో వెయ్యి స్క్రీన్లలో రిలీజ్
- ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు
రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందింది. అత్యంత భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమా, కరోనా కారణంగా పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ఈ నెల 25వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
యూకేలో ఈ సినిమాను వెయ్యి స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. వాటిలో లండన్ లోని ఓడియన్ బీఫ్ ఐ ఐమ్యాక్స్ ఒకటి. ఇది యూకేలోనే అతి పెద్ద స్క్రీన్. ఈ తెరపై 'ఆర్ ఆర్ ఆర్'ను చూడటం ఒక అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. ఒక తెలుగు సినిమా ఈ తెరను ఆక్రమించడం గౌరవమే కాదు .. గర్వకారణం కూడా.
ఇది చారిత్రక నేపథ్యంలోని కథ కావడం .. దాదాపు ఓకే ఇమేజ్ ఉన్న హీరోలకు సంబంధించిన మల్టీ స్టారర్ కావడం .. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకూ గల ఆర్టిస్టులు .. సాంకేతిక నిపుణులు ఈ సినిమాలో భాగం కావడం విశేషంగా చెప్పుకోవచ్చు. రిలీజ్ తరువాత ఈ సినిమా రికార్డుల పరంపర మొదలవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.