బంగాళాఖాతంలో అల్పపీడనం... వాయుగుండంగా మారే అవకాశం

  • శ్రీలంక తీరానికి ఆగ్నేయంగా అల్పపీడనం
  • అనుబంధంగా ఉపరితల ఆవర్తనం
  • తమిళనాడు, ఏపీలపైనా ప్రభావం
భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) తాజా హెచ్చరికలు చేసింది.  దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు (గురువారం) వాయుగుండంగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రస్తుతం ఇది శ్రీలంక తీరానికి సమీపంలో హిందూ మహాసముద్రానికి ఆనుకుని కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. రాగల 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా పయనించి శ్రీలంక తీరానికి సమీపంలోకి వస్తుందని, ఆపై మరో 24 గంటల్లో తమిళనాడు తీరానికి చేరువలోకి వస్తుందని ఐఎండీ వివరించింది. 

కాగా, ఈ అల్పపీడనం వాయుగుండంగా మారిన పిమ్మట దక్షిణ కోస్తాంధ్రపైనా ప్రభావం చూపుతుందని ప్రైవేటు వాతావరణ సంస్థల వెదర్ మోడల్స్ చెబుతున్నాయి. కాగా, అల్పపీడనానికి అనుబంధంగా సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడి ఉందని ఐఎండీ పేర్కొంది.


More Telugu News