రేపు ఏపీకి కేంద్ర మంత్రి షెకావత్.. ఎల్లుండి పోలవరం సందర్శన
- గురువారం రాత్రి జగన్ ఇచ్చే విందుకు హాజరు
- శుక్రవారం జగన్‌తో కలిసి పోలవరం సందర్శన
- ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష
బీజేపీ సీనియర్ నేత, కేంద్ర జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రేపు (గురువారం) ఏపీ పర్యటనకు రానున్నారు. ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించనున్న షెకావత్.. శుక్రవారం నాడు పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లనున్నారు. ఈ మేరకు షెకావత్ ఏపీ టూర్ షెడ్యూల్ కాసేపటి క్రితం విడుదలైంది.
ఈ షెడ్యూల్ ప్రకారం.. గురువారం సాయంత్రం 7.15 గంటలకు తాడేపల్లిలోని సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నివాసానికి రానున్న షెకావత్… రాత్రి జగన్ ఇచ్చే విందును స్వీకరించనున్నారు. రాత్రి బస అనంతరం శనివారం జగన్‌తో కలిసి పోలవరం ప్రాజెక్టులోని నిర్వాసిత కాలనీలు, ప్రాజెక్టును సందర్శించనున్నారు. అనంతరం ప్రాజెక్టు వద్ద పీపీఏ, జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. ఆ తర్వాత పోలవరం పర్యటనను ముగించుకుని విజయవాడలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం శుక్రవారం రాత్రి ఆయన ఢిల్లీ తిరుగు ప్రయాణం అవుతారు.