తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూలులో మార్పులు.. వివరాలు ఇవిగో
- ఇదివరకే షెడ్యూల్ ప్రకటించిన ఇంటర్ బోర్డు
- తాజాగా జేఈఈ మెయిన్స్ షెడ్యూల్ విడుదల
- దానికి అనుగుణంగా ఇంటర్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు
ఈ ఏడాది తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు ఇంతకుముందు ప్రకటించిన షెడ్యూల్ కంటే రెండు రోజులు ఆలస్యంగా మొదలు కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం సాయంత్రం ఓ ప్రకటన చేసింది. మారిన షెడ్యూల్ ప్రకారం తెలంగాణ ఫస్ట్ ఇయర్ ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 22 తేదీ నుంచి మొదలు కానుండగా.. సెకండ్ ఇయర్ ఇంటర్ పరీక్షలు 23వ తేదీ నుంచి మొదలుకానున్నాయి.
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇదివరకే ఇంటర్ బోర్డు షెడ్యూల్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 20న ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మొదలు కావాల్సి ఉంది. అదే విధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ఏప్రిల్ 21నుంచి మొదలుకావాల్సి ఉంది.
అయితే జేఈఈ మెయిన్స్ పరీక్షను ఏప్రిల్ 21న నిర్వహించనున్నట్లుగా కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా జేఈఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా ఉండేలా ఇంటర్ పరీక్షలను రెండు రోజులు ఆలస్యంగా మొదలుపెట్టేలా తెలంగాణ ఇంటర్ బోర్డు షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేసింది.