వచ్చే ఏడాది నుంచే తెలంగాణ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం
- ఒకే బుక్‌లో తెలుగు, ఆంగ్లంలో పాఠాలు
- 1 నుంచి 8 వరకు ఇంగ్లీష్ మీడియంలో బోధన
- కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం
ఏపీలో మాదిరే తెలంగాణలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనకు రంగం సిద్ధమైపోయింది. వచ్చే ఏడాది నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నట్లుగా తెలంగాణ మంత్రివర్గ ఉప సంఘం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు తొలుత ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలని కూడా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలోని కమిటీ ఖరారు చేసింది.
రాష్ట్రంలో ఆంగ్ల మాధ్యమంలో బోధనకు సంబంధించి అధ్యయనం చేయాలంటూ సీఎం కేసీఆర్.. మంత్రి సబిత నేతృత్వంలో ఓ కేబినెట్ సబ్ కమిటీని నియమించిన సంగతి తెలిసిందే. సబ్ కమిటీ అధ్యయనం దాదాపుగా పూర్తి కాగా..బుధవారం కమిటీ సభ్యులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా వచ్చే ఏడాది నుంచే ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధనను మొదలు పెట్టాలని కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత తెలుగు మాధ్యమ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ప్రతి పుస్తకంలో ఆంగ్లంలోని పాఠంతో పాటు సమాంతరంగా తెలుగులోనూ పాఠాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు.