ఆదినారాయణరెడ్డితో వివేకా అల్లుడి స్నేహం.. కారణమిదేనన్న తోపుదుర్తి
- రెండో భార్యకు వివేకా ఆస్తి ఇస్తాడని నర్రెడ్డి భయం
- వివేకా ఆస్తిని దక్కించుకునేందుకు యత్నాలు
- అందుకే మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డితో దోస్తానా
- నర్రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలను విచారించాలని తోపుదుర్తి డిమాండ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. ఇప్పటికే పలువురు నిందితులను అరెస్ట్ చేసిన సీబీఐ..త్వరలోనే మరికొందరినీ అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
ఇలాంటి కీలక సమయంలో ఈ కేసు విషయమై అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య రాజకీయ యుద్ధం జరుగుతోంది. వైఎస్ ఫ్యామిలీనే ఈ హత్య చేయించిందని టీడీపీ ఆరోపిస్తుంటే.. నాడు అధికార పార్టీగా ఉన్న టీడీపీ అండతో వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డే ఈ హత్య చేయించి ఉంటారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఇరు పార్టీలు నిత్యం ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి.
కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న ప్రస్తుత తరుణంలో వైసీపీ కీలక నేత, అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి బుధవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకాను ఆయన అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి హత్య చేయించి ఉండవచ్చని, నాడు మంత్రిగా ఉన్న ప్రస్తుత బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి అండతోనే నర్రెడ్డి ఈ హత్యకు పాల్పడి ఉండవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.
వివేకా తన ఆస్తిని తన రెండో భార్యకు ఇస్తాడని భావించిన నర్రెడ్డి.. ఎలాగైనా వివేకా ఆస్తి మొత్తాన్ని తానే దక్కించుకోవాలని పథకం వేశారన్నారు. ఈ క్రమంలోనే నాడు టీడీపీ సర్కారులో మంత్రిగా కొనసాగుతున్న ఆదినారాయణ రెడ్డితో నర్రెడ్డి స్నేహం చేశారని కూడా ఆయన ఆరోపించారు. ఈ కేసులో నర్రెడ్డితో పాటు ఆదినారాయణ రెడ్డిని కూడా సీబీఐ విచారించాలని తోపుదుర్తి డిమాండ్ చేశారు.