అనారోగ్యంతో ఉక్రెయిన్‌లో మరో భారత విద్యార్థి మృతి
- విన్నీసియాలో మెడిసిన్ చదువుతున్న చందన్ జిందాల్
- ఈ పంజాబ్ విద్యార్థికి ఇటీవలే అనారోగ్యం
- ఆసుపత్రిలో చేర్పించగా.. బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి
రష్యా బాంబు దాడులతో దద్దరిల్లిపోతున్న ఉక్రెయిన్‌లో ఇప్పటికే ఓ భారతీయుడు మృత్యువాత పడ్డ సంగతి తెలిసిందే. తాజాగా మరో భారతీయ విద్యార్థి కూడా అక్కడ మృతి చెందాడు. అయితే బుధవారం చనిపోయిన విద్యార్థి మృతికి యుద్ధం కారణం కాదని తెలుస్తోంది. అనారోగ్య కారణాలతోనే ఈ విద్యార్థి మరణించాడని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. రష్యా దాడుల్లో ఖర్కివ్‌లో మెడిసిన్ చదువుతున్న కర్ణాటక విద్యార్థి నవీన్ ఇదివరకే మృతి చెందిన సంగతి తెలిసిందే.
యుద్ధ సమయంలో మృతి చెందిన రెండో భారత విద్యార్థి పంజాబ్‌కు చెందిన వాడని, అతడి పేరు చందన్ జిందాల్ (22) అని జాతీయ మీడియా పేర్కొంది. ఉక్రెయిన్‌లోని విన్నీసియా నగరానికి చెందిన మెమోరియల్ మెడికల్ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తున్న జిందాల్ కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడట. దీంతో అతడిని స్థానిక ఆసుపత్రిలో చేర్చగా.. బుధవారం నాడు బ్రెయిన్ స్ట్రోక్ కారణంగా అతడు మరణించాడు.