ఖ‌ర్కివ్‌ను త‌క్ష‌ణ‌మే వీడండి.. భార‌తీయుల‌కు ఇండియ‌న్ ఎంబ‌సీ సూచ‌న‌

  • బుధ‌వారం సాయంత్రం 6 గంట‌ల్లోగా ఖ‌ర్కివ్‌ను వీడాలి
  • ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అక్క‌డ ఉండ‌రాదు
  • స‌మీపంలోని మూడు ప్రాంతాల‌కు చేరుకోవాల‌ని సూచ‌న‌ 
ర‌ష్యాతో యుద్ధం కార‌ణంగా భీతావ‌హ ప‌రిస్థితులు నెల‌కొన్న ఉక్రెయిన్‌లోని భార‌తీయుల త‌ర‌లింపు కోసం విదేశాంగ శాఖ నిర్విరామంగా కృషి చేస్తున్న సంగ‌తి తెలిసిందే. యుద్ధం మొద‌లై బుధవారం నాటికి వారం పూర్తి అవుతున్నా.. ర‌ష్యా బ‌ల‌గాలు ఇంకా వెన‌క్కు త‌గ్గ‌క‌పోగా.. ఉక్రెయిన్‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల‌ను త‌మ స్వాధీనంలోకి తీసుకునేందుకు దాడుల‌ను మ‌రింత‌గా పెంచేశాయి. 

ఈ క్ర‌మంలో ఉక్రెయిన్‌లోని ప్ర‌ధాన న‌గ‌రాల్లో ప‌రిస్థితి అంత‌కంత‌కూ క్షీణిస్తోంది. ఈ త‌ర‌హా ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఉక్రెయిన్ ప్ర‌ధాన న‌గ‌రం ఖ‌ర్కివ్‌లోని భార‌తీయుల‌కు ఉక్రెయిన్‌లోని భార‌త రాయ‌బార కార్యాల‌యం కాసేప‌టి క్రితం ఓ కీల‌క సూచ‌న‌ను జారీ చేసింది. 

ఉన్నప‌ళంగా ఖ‌ర్కివ్‌ను వ‌ద‌లాల‌ని, ఉక్రెయిన్ కాల‌మానం ప్ర‌కారం ఈ సాయంత్రం 6 గంట‌ల్లోగా తాము చెప్పిన ప్ర‌దేశాల‌కు చేరుకోవాల‌ని ఇండియ‌న్ ఎంబ‌సీ సూచించింది. పెసోచిన్‌, బ‌బ‌యే, బెజ్ల్‌యుడోవ్‌స్కాల‌కు వీల‌యినంత త‌ర్వాత‌గా చేరుకోవాల‌ని సూచించింది. ఏది ఏమైనా ఈ రోజు సాయంత్రం 6 గంట‌ల్లోగా ఖ‌ర్కివ్‌ను వ‌ద‌లాల‌ని ఇండియ‌న్ ఎంబ‌సీ త‌న ప్ర‌క‌ట‌న‌లో సూచించింది.


More Telugu News