బీజేపీని అపఖ్యాతి పాల్జేసేందుకు ఎన్నెన్ని కుట్రలో?: విజయశాంతి ఫైర్
- హిందువుల మధ్య చిచ్చుకు టీఆర్ఎస్ కుట్ర
- అందుకు ప్రశాంత్ కిశోర్ సేవలను వినియోగించుకుంటున్నారు
- దేశాన్ని కాపాడే సైన్యంపై విద్వేషాలకు రాహుల్ యత్నం
- టీఆర్ఎస్, కాంగ్రెస్‌లపై రాములమ్మ మండిపాటు
బీజేపీని అపఖ్యాతి పాలుజేసేందుకు అటు తెలంగాణలో, ఇటు జాతీయ స్థాయిలో చాలా కుట్రలు జరుగుతున్నాయని ఆ పార్టీ మహిళా నేత, మెదక్ మాజీ ఎంపీ విజయశాంతి ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా.. ప్రజలకు నిజం తెలుసు కనుక ఆ కుట్రలేమీ వర్కవుట్ కావని కూడా ఆమె తేల్చి చెప్పారు. ఈ మేరకు కాసేపటి క్రితం ఆమె ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేశారు.
తెలంగాణలో బీజేపీని అపఖ్యాతి పాలుజేసేందుకు అధికార టీఆర్ఎస్ నానా పాట్లు పడుతోందని విజయశాంతి ఆరోపించారు. ఇందుకోసం హిందువుల మధ్య చిచ్చు పెట్టి విడగొట్టేందుకు సోషల్ మీడియా ఆధారంగా కుట్రలు మొదలయ్యాయని ఆమె మండిపడ్డారు. ఇందుకోసం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఫేక్ ప్రొఫైల్స్‌తో కూడిన సోషల్ మీడియా ఖాతాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు.
ఇక జాతీయ స్థాయిలోనూ బీజేపీని అపఖ్యాతి పాలుజేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోందని ఆమె అన్నారు. ఇందులో భాగంగా పంజాబ్‌లో 100 కిలోమీటర్ల ప్రాంతాన్ని సైన్యానికి అప్పగించేశారని కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు. దేశాన్నికాపాడే సైనికుల పట్ల విద్వేషాన్ని రగిలిస్తున్నారని ఆమె రాహుల్‌పై విరుచుకుపడ్డారు. ఉక్రెయిన్ నుంచి విరామం లేకుండా భారతీయ విద్యార్థులను క్షేమంగా రప్పించేందుకు.. కేంద్రం చేస్తున్న కృషిని ప్రజలు మెచ్చుకుంటుంటే చూడలేక బురదజల్లుతున్నారని ఆమె ఆరోపించారు.