రష్యాకు భారీ నష్టం.. పెద్ద సంఖ్యలో సైనికులను, యుద్ధ విమానాలను, హెలీకాప్టర్లను కోల్పోతున్న వైనం!

  • తీవ్ర స్థాయికి చేరిన రష్యా, ఉక్రెయిన్ యుద్ధం
  • 846 సైనిక వాహనాలను ధ్వంసం చేశామన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు
  • రష్యా పవర్ గ్రిడ్, రైల్వే వ్యవస్థలపై కూడా దాడి చేస్తున్నామని వెల్లడి
ఉక్రెయిన్, రష్యాల మధ్య పోరు తీవ్ర స్థాయికి చేరింది. భారీ ఎత్తున దాడికి తెగబడిన రష్యాకు ఉక్రెయిన్ నుంచి పెద్ద స్థాయిలోనే ప్రతిఘటన ఎదురవుతోంది. యుద్ధంలో ఉక్రెయిన్ సైనికుల కంటే రష్యా సైనికులే ఎక్కువగా మృతి చెందినట్టు తెలుస్తోంది. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు చేసిన ప్రకటన ఔరా అనిపించే విధంగా ఉంది. 

ఆయన చెప్పిన వివరాల ప్రకారం గత 6 రోజుల్లో 6 వేల మంది రష్యా సైనికులను ఉక్రెయిన్ మట్టుబెట్టింది. సైనికులను రవాణా చేసే 846 సాయుధ వాహనాలను ధ్వంసం చేసింది. 29 యుద్ధ విమానాలు, 29 హెలీకాప్టర్లు, 77 రష్యన్ ఆర్టిలరీ వ్యవస్థలను ధ్వంసం చేశామని ఆయన తెలిపారు. అంతేకాదు రష్యా పవర్ గ్రిడ్, రైల్వే వ్యవస్థలపై కూడా దాడి చేస్తున్నామని చెప్పారు. మరోవైపు రష్యా రక్షణ మంత్రి మాట్లాడుతూ, ఉక్రెయిన్ ను ఆక్రమించేంత వరకు దాడిని కొనసాగిస్తామని తెలిపారు.


More Telugu News