అర్హత లేని వారిని డీజీపీగా నియమించారు... కేంద్ర హోంమంత్రి, యూపీఎస్సీ చైర్మన్ కు రఘురామ లేఖ
- ఇటీవల ఏపీ డీజీపీగా సవాంగ్ తొలగింపు
- నూతన డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి నియామకం
- సీనియర్లను పక్కనబెట్టారన్న రఘురామ
ఇటీవల ఏపీలో గౌతమ్ సవాంగ్ స్థానంలో కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిని డీజీపీగా నియమించడం తెలిసిందే. దీనిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్రానికి లేఖ రాశారు. అర్హత లేనివారిని డీజీపీగా నియమించారంటూ కేంద్ర హోంమంత్రి, యూపీఎస్సీ చైర్మన్ లకు లేఖ రాశారు.
కొత్త డీజీపీ నియామకం సందర్భంగా రాష్ట్రంలో సీనియర్ ర్యాంకు అధికారులను పక్కనబెట్టారని, అర్హత లేనివారిని డీజీపీగా నియమించారని ఆరోపించారు. యూపీఎస్సీ అనుమతితో డీజీపీ నియామకం చేపట్టాల్సి ఉందని, గౌతమ్ సవాంగ్ సహా ముగ్గురు అధికారుల పేర్లతో ప్రతిపాదనలు పంపేలా చూడాలని రఘురామ తన లేఖలో కేంద్రాన్ని కోరారు.