వైరల్ న్యూస్.. బంకర్‌లోకి పుతిన్ ఫ్యామిలీ?
- పుతిన్‌పై గతంలోనూ వాలేరీ ఆరోపణలు
- తాజాగా పుతిన్ ఫ్యామిలీ బంకర్‌కు వెళ్లిపోయిందని సంచలన ఆరోపణ
- సైబీరియాలోని న్యూక్లియర్ బంకర్‌లో పుతిన్ ఫ్యామిలీ ఉందని వెల్లడి
ఉక్రెయిన్‌ను వశం చేసుకోవాలన్న కసితో సాగుతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు సంబంధించిన ఓ వార్తపై గడచిన రెండురోజులుగా ప్రపంచ వ్యాప్తంగా పెద్ద చర్చే నడుస్తోంది. ఉక్రెయిన్ ఎలాగూ లొంగేలా లేదని, పాశ్చాత్య దేశాలన్నీ ఆ దేశానికి అండగా నిలుస్తున్న వైనంతో ఉక్రెయిన్‌పై అణుబాంబుతో విరుచుకుపడక తప్పదన్న భావనకు పుతిన్ వచ్చారని, అదే జరిగితే తన కుటుంబానికి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేలా తన ఫ్యామిలీ మొత్తాన్ని ఆయన న్యూక్లియర్ బంకర్‌కు తరలించారనేదే ఆ వార్త సారాంశం. ఈ వార్తలో ఏ మేర వాస్తవముందో తెలియదు గానీ..దీనిపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది.
ఈ వార్తను తొలుత ప్రచారంలోకి తెచ్చింది రష్యా రాజకీయ శాస్త్ర అధ్యాపకుడు ప్రొఫెసర్ వాలెరీ సోలేవే. మాస్కో స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంస్థలో వాలెరీ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అయితే గతంలోనూ ఈ మాదిరిగానే పుతిన్‌పై పలు వార్తలు ప్రచారం చేసిన వాలేరీపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యారు. ఆయనపై ఆ దేశ పోలీసులు ఇంకా దర్యాప్తు సాగిస్తున్నట్లుగా సమాచారం. పుతిన్‌పై వాలేరీ చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనన్న వాదనలు లేకపోలేదు.
తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో తనపై ఆంక్షలు విధిస్తున్న అంతర్జాతీయ సమాజంపై పుతిన్ తనదైన శైలిలో బెదిరింపులకు దిగుతున్నారు. తమ వద్ద అణు బాంబులు ఉన్నాయని, వాటిని ఉక్రెయిన్‌పైనా, ఆ దేశానికి మద్దతుగా నిలిచే దేశాలపైనా వేస్తామంటూ ఇదివరకే పుతిన్ హెచ్చరించారు కూడా. ఈ క్రమంలో ఉక్రెయిన్‌పై యుద్ధం అణు యుద్ధంగా మారుతుందన్న భావనతో పుతిన్ ఉన్నారని వాలేరీ చెప్పారు. అందుకే అణు యుద్ధం నుంచి తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు పుతిన్ పక్కాగానే ప్లాన్ చేసుకున్నారని చెప్పారు. ఇందులో భాగంగా తన కుటుంబాన్ని సైబీరియాలోని భూగర్భ నగరానికి తరలించారని ఆయన ఆరోపించారు.