వైరల్ వీడియో.. రష్యా ల్యాండ్‌మైన్‌ను అలా తీసి ఇలా పారేసిన ఉక్రెయిన్ పౌరుడు
- ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులే లక్ష్యంగా రష్యా ల్యాండ్ మైన్
- ల్యాండ్‌మైన్‌ను ఒట్టి చేతులతో పట్టుకుని దూరంగా పారేసిన ఉక్రెయిన్ వాసి
- భయం లేకుండా దమ్ము కొడుతూ ల్యాండ్‌మైన్‌తో అల్లంత దూరం నడిచిన వైనం
తమ దేశంపై దండెత్తి వచ్చిన రష్యా బలగాలను ఓ వైపు ఉక్రెయిన్ సైనికులు ఎదురొడ్డి నిలువరిస్తుంటే.. ఉక్రెయిన్ పౌరులు కూడా తమదైన రీతిలో రష్యా దళాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. మొన్నటికి మొన్న సింగిల్‌గానే రోడ్డుపైకి వచ్చి రష్యా యుద్ధ ట్యాంకును ఓ ఉక్రెయిన్ పౌరుడు నిలిపేస్తే.. నిన్నటికి నిన్నె ఉక్రెయిన్ రైతు రష్యా యుద్ధ ట్యాంకును ఏకంగా తన ట్రాక్టర్‌కు తగిలించుకుని తీసుకెళ్లే యత్నం చేశాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా.. తాజాగా బుధవారం నాడు వెలుగులోకి వచ్చిన వీడియో వాటి కంటే మరింత వైరల్‌గా మారిపోయింది.
ఈ వీడియోలో ఉక్రెయిన్ దళాలను మట్టి కరిపించేందుకు రష్యా బలగాలు రోడ్డుపై పాతిన మందుపాతరను ఓ ఉక్రెయిన్ పౌరుడు ఎంతమాత్రం భయం లేకుండా ఒట్టి చేతులతో ఇలా తీసి అలా అల్లంత దూరం నడిచి వెళ్లి పారేశాడు. ఈ సందర్భంగా అతడు నింపాదిగా సిగరెట్ తాగుతూ నడిచిన వైనం ఆకట్టుకుంటోంది. ఈ ఘటన ఉక్రెయిన్‌లోని బెర్డయాన్స్క్లో కనిపించింది.
ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకోవాలన్న కసితో సాగుతున్న రష్యా బలగాలు... ఉక్రెయిన్‌లోని బెర్డయాన్స్క్ నగరంలో ఉక్రెయిన్ యుద్ధ ట్యాంకులను పేల్చాలన్న ఉద్దేశంతో రష్యా సేనలు నడిరోడ్డుపై ఓ ల్యాండ్‌మైన్‌ను అమర్చాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ ఉక్రెయిన్ పౌరుడు ఆ ల్యాండ్‌మైన్‌ను చూశాడు.
అయితే, దాని గురించి బాంబ్ స్క్వాడ్‌కు సమాచారం ఇవ్వకుండానే అనుకున్నదే తడవుగా రోడ్డు మీద ఉన్న ఆ ల్యాండ్‌మైన్‌కు రెండు ఎలాంటి రక్షణ పరికరాల సాయం లేకుండానే ఒట్టి చేతులతో పట్టుకొని దూరంగా వెళ్లి విసిరిపారేశాడు. ల్యాండ్‌మైన్‌ను తీసుకువెళ్తున్న సమయంలో బాంబు పట్టుకున్నాననే టెన్షన్ లేకుండా అతను సిగరెట్ తాగుతూ ఓ హీరోలా దాన్ని పట్టుకుని నడిచిన వైనం అందరినీ ఆకట్టుకుంటోంది.