రొమేనియా, హంగేరీ దేశాలకు ఏపీ ప్రతినిధులను పంపాలని సీఎం జగన్ నిర్ణయం
- ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన ఏపీ విద్యార్థులు
- తరలింపు చర్యలు ముమ్మరం
- 680 మంది ఏపీ విద్యార్థుల వివరాలు కేంద్రానికి అందజేత
- క్షేమంగా తీసుకురావాలని అధికారులకు సీఎం జగన్ ఆదేశం
యుద్ధ ప్రభావిత ఉక్రెయిన్ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు మరింత ఊపందుకున్నాయి. ఓవైపు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా, మరోవైపు ఏపీ కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. ఉక్రెయిన్ తో సరిహద్దు పంచుకుంటున్న పొలెండ్, హంగేరీ దేశాలకు ఏపీ ప్రభుత్వం తరఫున ప్రతినిధులను పంపనున్నారు. ఈ నిర్ణయానికి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. విద్యార్థులను క్షేమంగా తీసుకువచ్చేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆయా దేశాలకు వెళ్లనున్న ఏపీ ప్రతినిధులు రాష్ట్ర విద్యార్థుల తరలింపును సమన్వయం చేయనున్నారు. ఇప్పటికే ఏపీకి చెందిన 680 మంది విద్యార్థుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర విదేశాంగ శాఖకు అందించింది. భారత్ లోని ఉక్రెయిన్ దౌత్య కార్యాలయం నుంచి ఈ వివరాలు సేకరించారు.