గతంలో నడిరోడ్డుపై కొట్టుకున్న దీపికా పదుకొణే మాజీ ప్రియులు.. తాజాగా వెలుగులోకి!

  • గతంలో జరిగిన ఘటనను వెల్లడించిన సన్నిహితులు
  • నిహార్ తో రణ్ బీర్ స్ట్రీట్ ఫైట్
  • రణ్ బీర్ తో డేట్ చేస్తూనే నిహార్ తో దీపిక సాన్నిహిత్యం 
  • దీపికపై రణ్ బీర్ కు అసూయ ఎక్కువని కామెంట్లు
దీపికా పదుకొణే .. ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ ను వివాహం చేసుకుని జీవితాన్ని హాయిగా గడిపేస్తోంది. ఇటీవల ఓ యువ హీరోతో ‘గెహ్రాయియా’ సినిమా చేసి హిట్ అందుకుంది. అయితే, ఆ సినిమాలో బోల్డ్ సీన్లలో నటించి కొందరి నుంచి విమర్శలనూ ఆమె ఎదుర్కొంది. ఈ విషయాన్ని పక్కనపెడితే.. పెళ్లి కాకముందు ఆమె నిహార్ పాండ్యా, రణ్ బీర్ కపూర్ తో ప్రేమాయణం నడిపింది. అయితే, ఆ రిలేషన్లు ఎక్కువ కాలం నిలబడలేదు. 

ఈ క్రమంలోనే ఆమె పాత రిలేషన్లకు సంబంధించి దీపిక సన్నిహితులు తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓసారి దీపిక మాజీ ప్రియుడు నిహార్ పాండ్యాను రణ్ బీర్ కపూర్ నడిరోడ్డుపై కొట్టాడని చెప్పారు. రణ్ బీర్ కపూర్ తో డేటింగ్ చేసే సమయంలోనే.. ఆమె తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నిహార్ పాండ్యాతో చనువుగా ఉందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఒకానొక సందర్భంలో సినిమా షూటింగ్ కోసం రణ్ బీర్ ఊటీకి వెళ్లినప్పుడు.. ఆమె నిహార్ తో లంచ్ కు వెళ్లిందని, దాదాపు రెండు గంటల పాటు వారి లంచ్ డేట్ జరిగిందని చెప్పారు. 

మరోసారి దీపిక, నిహార్ కలిసి వెళ్తున్నప్పుడు రణ్ బీర్ చూశాడని, వాళ్లను ఆపిన రణ్ బీర్.. నిహార్ మొహంపై కొట్టాడని, ఇద్దరూ నడ్డిరోడ్డు మీద కొట్టుకున్నారని చెబుతున్నారు. చాందినీ చౌక్ టు చైనా సినిమా చేసే సమయంలో దీపికపై రణ్ బీర్ అసూయ పెంచుకున్నాడని చెప్పారు. యశ్ రాజ్ సినిమా షూటింగ్ కోసం వాళ్లు ఆస్ట్రేలియాకు వెళ్లారని, కానీ, మధ్యలోనే దీపికా వెళ్లిపోయినా తమ రిలేషన్ అంతంతమాత్రంగానే ఉండడంతో ఏమన్లేదని గుర్తు చేశారు. 

అయితే, నిహార్ పాండ్యా విషయంలో మాత్రం రణ్ బీర్ ఎప్పుడూ అభద్రతా భావంలోనే ఉండేవాడని చెప్పారు. అయితే, ప్రస్తుతం అందరి మధ్యా సఖ్యత బాగానే ఉన్నట్టు తెలుస్తోంది. గొడవలన్నీ మరచిపోయి స్నేహితుల్లా ఉంటున్నారని చెబుతున్నారు.


More Telugu News