వృద్ధిమాన్ సాహాను జట్టులోకి తీసుకోకపోవడంపై దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఆయా కారణాలను అర్థం చేసుకోవాలి
- జట్టులో స్థానం పొందనందుకు సాహా బాధపడటంలో తప్పేమీ లేదు
- 15 ఏళ్లుగా ఎంఎస్ ధోనీ జట్టులో కొనసాగాడు
- అలాగే రెండున్నరేళ్లుగా పంత్ కూడా అంతే నిలకడగా రాణిస్తున్నాడు
- అందుకే సాహాను కాదని పంత్‌ను తీసుకున్నారన్న దినేశ్
శ్రీలంకతో ఎల్లుండి భారత్ తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ మ్యాచుకు సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను జట్టులోకి తీసుకోకపోవడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దినేశ్ కార్తీక్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జట్టు సభ్యులపై యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఊహించని విధంగా ఉన్నప్పటికీ సాహాను పక్కనబెట్టి రిషభ్ పంత్‌ను తీసుకోవడానికి గల కారణాలను అర్థం చేసుకోవాలని చెప్పాడు.
జట్టులో స్థానం పొందనందుకు సాహా బాధపడటంలో తప్పేమీ లేదని, వికెట్ కీపింగ్‌లో అతడి నైపుణ్యం చాలా బాగుంటుందని తెలిపాడు. జట్టులో స్థానం దొరకకపోతే జీర్ణించుకోవడం చాలా కష్టమేనని అన్నాడు. అయితే, జట్టును ఏ విధంగా ఎంపిక చేశారనే విషయంపై సెలెక్షన్ కమిటీ నిర్ణయాన్ని అంచనా వేసుకోవాలని ఆయన అన్నాడు. టీమిండియాకు సాహా గొప్ప సేవలు అందించాడని కార్తీక్ తెలిపాడు.
అత్యుత్తమ వికెట్ కీపర్లలో సాహా ఒకడని చెప్పాడు. అలాగే, 15 ఏళ్లుగా ఎంఎస్ ధోనీ జట్టులో ఎలా కొనసాగాడో, అలానే రెండున్నరేళ్లుగా పంత్ కూడా అంతే నిలకడగా రాణిస్తున్నాడని అన్నాడు. ఈ నేపథ్యంలో పంత్ తర్వాతే సాహా రెండో కీపర్‌గా ఉండాల్సి వస్తోందని కార్తీక్ అభిప్రాయపడ్డాడు.