రష్యా గగనతలం మీదుగా భారత్​కు విమానాలను నిలిపేసిన అమెరికా

  • యునైటెడ్ ఎయిర్ లైన్స్, అమెరికా ఎయిర్‌లైన్స్ ప్ర‌క‌ట‌న‌లు
  • అమెరికా నుంచి ముంబై, ఢిల్లీకి చేరేందుకు రష్యా గగనతలాన్ని వాడకూడ‌దు
  • స్ప‌ష్టం చేసిన విమానయాన సంస్థ‌లు
  • ఈ నిర్ణయం తాత్కాలికమేనని వివ‌ర‌ణ‌
ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం జ‌రుగుతుండ‌డంతో అమెరికా ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ర‌ష్యా మీదుగా భారత్ కు విమానాలను నిలిపేసింది. ఈ వివ‌రాల‌ను అమెరికాకు చెందిన‌ యునైటెడ్ ఎయిర్‌ లైన్స్‌ ఈ రోజు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. త‌మ దేశం నుంచి ముంబై, ఢిల్లీకి చేరేందుకు రష్యా గగనతలాన్ని వినియోగించటాన్ని నిలిపివేసినట్లు స్ప‌ష్టం చేసింది. 

అయితే, తాము తీసుకున్న‌ ఈ నిర్ణయం తాత్కాలికమేనని వివ‌రించింది. ఇందుకు సంబంధించిన‌ పూర్తి వివరాలు వెల్లడించలేదు. అలాగే అమెరికన్ ఎయిర్‌ లైన్స్‌ కూడా ప‌లు నిర్ణ‌యాలు తీసుకుంటోంది. ఢిల్లీ-న్యూయార్క్ మధ్య తిరిగే విమానాలు రష్యా గగనతలాన్ని వినియోగించకుండా నిలిపేశామ‌ని పేర్కొంది. 

కాగా, రష్యా విమానాలు అమెరికా గగనతలం మీదుగా వెళ్ల‌డాన్ని నిషేధిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించిన అనంత‌రం విమానయాన సంస్థలు ఈ ప్ర‌క‌ట‌న చేయ‌డం గ‌మ‌నార్హం.


More Telugu News