యాక్సిడెంటు కేసులో.. జడేజా భార్య, ఆమె తల్లికి సమన్లు పంపిన కోర్టు
- 2018లో ఓ రోడ్డు ప్రమాదం
- రివాబా కారు కానిస్టేబుల్ అహిర్ ను ఢీ కొట్టిన వైనం
- ఆమెపై దాడి చేసిన కానిస్టేబుల్
- ఇప్పటికే పలుసార్లు రివాబాకు సమన్లు
ఓ రోడ్డు ప్రమాదం కేసులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా భార్య రివాబాకు, ఆమె తల్లికి జామ్‌నగర్ కోర్టు సమన్లు జారీ చేసింది. విచారణకు రావాలని పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి వారిద్దరికి పంపిన సమన్లే ఆఖరి సమన్లని పోలీసులు చెప్పారు. ఆ కేసులో ఇప్పటి వరకు వారు ఎలాంటి స్టేట్‌మెంట్ ఇవ్వలేదని అన్నారు. గతంలో రివాబాకు సమన్లు పంపినా హాజరుకాలేదు.
గుజరాత్, జామ్‌నగర్‌లోని సరు సెక్షన్ రోడ్డులో 2018లో ఓ ప్రమాదం చోటు చేసుకుంది. రివాబా కారు కానిస్టేబుల్ అహిర్ మోటార్‌సైకిల్ సహా మరో బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బాధితులకు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, ఆ కోపంలో సదరు కానిస్టేబుల్ రివాబాపై దాడి చేశాడని స్థానికులు చెప్పారు.
ఆమెపై దాడికి దిగిన కానిస్టేబుల్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో పోలీసులు అన్నారు. అనంతరం రివాబా ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు కానిస్టేబుల్ అహిర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అహిర్‌కు బెయిల్ వచ్చింది. ఈ కేసులోనే రివాబా, ఆమె తల్లి వివరణ ఇచ్చేందుకు రావాలని కోర్టు సమన్లు ఇచ్చింది.