'అశోకవనంలో అర్జున కల్యాణం' రిలీజ్ డేట్ వాయిదా!

  • మాస్ ఆడియన్స్ లో విష్వక్సేన్ కి మంచి క్రేజ్ 
  • ఫ్యామిలీ హీరో ఇమేజ్ కోసం ప్రయత్నాలు 
  • అలాంటి కథతో చేసిన సినిమా వాయిదా 
  • త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటన
విష్వక్సేన్ ఇంతవరకూ యూత్ కీ .. మాస్ ఆడియన్స్ కి మాత్రమే నచ్చే కథలను చేస్తూ వచ్చాడు. ఇక ఇప్పుడు ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే పనిలో ఉన్నాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఆయన 'అశోక వనంలో అర్జున కల్యాణం' సినిమాను చేశాడు. బాపినీడు - సుధీర్ నిర్మించిన ఈ సినిమాకి విద్యాసాగర్ దర్శకత్వం వహించాడు. 

ఈ సినిమాలో విష్వక్సేన్ సరసన నాయికలుగా రుక్షర్ థిల్లోన్ - రితిక నాయక్ నటించారు. జై క్రిష్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను ఈ నెల 4వ తేదీన విడుదల చేయాలనుకున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్లను కూడా వదిలారు. కానీ తాజాగా ఈ సినిమా విడుదల తేదీని వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ చెబుతామని అన్నారు 

ఈ నెల 4వ తేదీన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా థియేటర్లకు వస్తోంది. శర్వానంద్ కి ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక గ్లామరస్ హీరోయిన్ గా రష్మికకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. పైగా ఈ రెండు కథలు కూడా పెళ్లి చూపులు ప్రధానంగా నడిచేవే. అందువలన విష్వక్సేన్ వెనక్కి తగ్గి ఉండొచ్చని అనుకోవచ్చు.


More Telugu News