అణుదాడికి సమాయత్తమవుతున్న రష్యా!
- ఉక్రెయిన్ ఎదురుదాడి, పలు దేశాల ఆంక్షలు
- అణ్వాయుధ వ్యవస్థల అప్రమత్తతకు పుతిన్ ఆదేశం
- ఏ క్షణంలోనైనా అణుదాడి చేయడానికి సిద్ధంగా కసరత్తు
- ఇప్పటికే విన్యాసాల కోసం అణు జలాంతర్గాముల సిద్ధం
- కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా సన్నద్ధం
ఉక్రెయిన్పై దాడుల జరిపి, ఆ దేశాన్ని తమ దారిలోకి తెచ్చుకోవాలని భావిస్తోన్న రష్యాకు గట్టి ఎదురు దెబ్బలు తగులుతోన్న విషయం తెలిసిందే. ఓ వైపు ఉక్రెయిన్ ఎదురుదాడి, మరోవైపు ఆ దేశానికి పలు దేశాల మద్దతు, రష్యాపై ఆంక్షలు విధిస్తుండడంతో రష్యా ఇబ్బందుల్లో పడింది. దీంతో మరిన్ని సవాళ్లు ఎదురైతే ఎదుర్కోవడానికి అణ్వాయుధాలను కూడా వాడడానికి రష్యా సిద్ధమవుతున్నట్టు వార్తలొస్తున్నాయి.
అణ్వాయుధ వ్యవస్థల అప్రమత్తతకు రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇటీవల తమ సైన్యాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో ఈ మేరకు రష్యా సైన్యం ఏర్పాట్లు చేసుకుంటోంది. అవసరమైతే ఏ క్షణంలోనైనా అణుదాడి చేయడానికి సిద్ధంగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే విన్యాసాల కోసం అణు జలాంతర్గాములను బేరెంట్స్ సముద్ర జలాల్లోకి తరలించడం గమనార్హం. సైబీరియా మంచు అడవుల్లో సంచార క్షిపణి ప్రయోగ వ్యవస్థలను ఉంచారు. సముద్ర జలాల్లో విన్యాసాలు చేస్తామని, పలు అణు జలాంతర్గాములు పాల్గొంటాయని రష్యాకు చెందిన నార్తర్న్ ఫ్లీట్ తెలిపింది.
వాటిని కఠిన వాతావరణ పరిస్థితుల్లోనూ పనిచేసేలా సిద్ధం చేయడమే లక్ష్యమని వివరించింది. పలు నౌకా స్థావరాలు ఉన్న కోలా దీవి చుట్టూ యుద్ధ నౌకలను రంగంలోకి దించారు. అవి కూడా విన్యాసాల్లో పాల్గొననున్నాయి. ఇర్కుత్స్క్ ప్రాంతంలో అడవుల్లోకి ఖండాంతర క్షిపణుల ప్రయోగ వ్యవస్థలను తరలించామని రష్యా ప్రకటించింది. ప్రపంచంలో ఏ దేశానికి లేనన్ని అణ్వాయుధాలను రష్యా అభివృద్ధి చేసుకుంది.
మరోపక్క, అణుయుద్ధం గనుక జరిగితే భవిష్యత్తు తరాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రష్యా అణ్వస్త్రాలను సిద్ధం చేస్తుండడంతో ఊహించని పరిస్థితులు ఎదురైతే ఎదుర్కోవడానికి అమెరికాలాంటి ఇతర దేశాలు కూడా అణ్వాయుధాలను వాడడానికి సిద్ధమయ్యే పరిస్థితులు తలెత్తే ముప్పు ఉంది.