హైదరాబాద్ లో 467 మంది శ్రీమంతులు

  • 13,637కు చేరిన అల్ట్రా హెచ్ఎన్ఐలు
  • 2021లో 11 శాతం వృద్ధి
  • ఒక్కొక్కరి వద్ద రూ.225 కోట్లు అంతకుమించి సంపద 
  • దేశంలో 146 మంది బిలియనీర్లున్నారన్న నైట్ ఫ్రాంక్ సంస్థ 
ఒకవైపు కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను పట్టి పీడిస్తుంటే.. మరోవైపు ధనవంతుల సంఖ్య విస్తరిస్తూ పోతోంది. భారత్ లో అధిక ధనవంతులు (అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు/అల్ట్రా హెచ్ ఎన్ఐలు) గతేడాది 11 శాతం కొత్తగా పుట్టుకొచ్చారు. వీరి సంఖ్య 2021 చివరికి 13,637కు పెరిగినట్టు నైట్ ఫ్రాంక్ సంస్థ ఓ నివేదిక రూపంలో వెల్లడించింది. 

ప్రపంచవ్యాప్తంగా అధిక ధనవంతుల వృద్ధి 2021లో 9.3 శాతంగా ఉంటే, దీనితో పోలిస్తే భారత్ లోనే పెరుగుదల ఎక్కువగా ఉంది. అంతర్జాతీయంగా అధిక ధనవంతుల సంఖ్య 2021 చివరికి 6.1 లక్షలకు చేరింది. 30 మిలియన్ డాలర్లు (రూ.225 కోట్లు) అంతకంటే ఎక్కువ సంపద ఉన్న వారిని అల్ట్రా హెచ్ఎన్ఐలుగా పరిగణిస్తారు. ఇక 145 మంది బిలియనీర్లతో (కనీసం బిలియన్ డాలర్లు/రూ.7,500కోట్లు అంతకుమించి) భారత్ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉంది. 

748 బిలియనీర్లతో అమెరికా, 554 మంది బిలియనీర్లతో చైనా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అల్ట్రా హెచ్ఎన్ఐలకు ముంబై కేంద్రంగా ఉంది. ఇక్కడ 1,596 మంది ఉన్నారు. ఆ తర్వాత హైదరాబాద్ లో 467 మంది, పూణెలో 360 మంది, ఢిల్లీలో 210 మంది చొప్పున ఉన్నారు.


More Telugu News