దేశంలో క‌రోనా కేసుల తాజా వివరాలు ఇవిగో

  • దేశంలో కొత్త‌గా 7,554 క‌రోనా కేసులు
  • క‌రోనాతో నిన్న 223 మంది మృతి
  • 177.79 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగం
  • రోజువారీ పాజిటివిటీ రేటు 0.96 శాతం
దేశంలో కొత్త‌గా 7,554 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, క‌రోనాతో నిన్న 223 మంది ప్రాణాలు కోల్పోయిన‌ట్లు వివరించింది. క‌రోనా నుంచి కొత్త‌గా 14,123 మంది కోలుకున్నారని తెలిపింది. 

ఇక ప్ర‌స్తుతం ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో 85,680 మంది చికిత్స తీసుకుంటున్నార‌ని వివ‌రించింది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో 177.79 కోట్ల వ్యాక్సిన్ డోసులు వినియోగించిన‌ట్లు తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.96 శాతంగా ఉంద‌ని వివ‌రించింది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 76.91 కోట్ల క‌రోనా ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు పేర్కొంది.


More Telugu News