ఈ వేసవిలో ఉత్తర కోస్తా భగభగే: వాతావరణశాఖ తొలి బులిటిన్ విడుదల

  • మార్చి, ఏప్రిల్, మే నెలలకు సంబంధించిన వివరాలతో కూడిన బులెటిన్ విడుదల
  • దక్షిణాదిలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికం
  • ఒక్క ఉత్తర కోస్తాలో మాత్రం వేసవి నుంచి ఉష్ణోగ్రతల పెరుగుదల
ఈ వేసవికాలం ఎలా ఉండబోతోందన్న దానిపై భారత వాతావరణ శాఖ తొలి బులిటిన్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఈ వేసవిలో ఉత్తర కోస్తా ఎండలతో అదిరిపోవడం ఖాయం. రాయలసీమతోపాటు మిగిలిన కోస్తా ప్రాంతంలో మాత్రం ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయి. మార్చి, ఏప్రిల్, మే.. ఈ మూడు నెలలకు గాను ఉష్ణోగ్రతలు, వర్షాలకు సంబంధించిన వివరాలతో కూడిన ఈ బులెటిన్‌లో.. దక్షిణ భారతదేశంలో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఎండ తీవ్రత కొంత అధికంగా ఉంటుంది. 

పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయి. దక్షిణాదిలో మాత్రం సాధారణం, లేదంటే అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అయితే, ఒడిశా, చత్తీస్‌గఢ్‌ను ఆనుకుని ఉన్న ఉత్తర కోస్తాలో మాత్రం ఎండలు దంచికొట్టనున్నాయి. ఇక్కడ ఏప్రిల్ నుంచి ఎండ వేడిమి అంతకంతకూ పెరుగుతుందని వాతావరణశాఖ తన బులెటిన్‌లో పేర్కొంది. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని తెలిపింది.


More Telugu News