పుతిన్ లెక్క త‌ప్పింది.. బ్రిట‌న్ ప్ర‌ధాని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

  • ఉక్రెయిన్ సామ‌ర్ధ్యాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేశారు
  • పాశ్చాత్య దేశాల ఐక్య‌త‌నూ ప‌సిగ‌ట్ట‌లేక‌పోయారు
  • పుతిన్‌పై బ్రిట‌న్ ప్ర‌ధాని సెటైర్లు
ఉక్రెయిన్ యుద్ధంలో ర‌ష్యా వైఖ‌రిపై.. ప్ర‌త్యేకించి ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ వైఖ‌రిపై ప్ర‌పంచ దేశాలు రకరకాలుగా వ్యాఖ్య‌లు చేస్తున్నాయి. ఇందులో భాగంగా బ్రిట‌న్ ప్ర‌ధాని బోరిస్ జాన్స‌న్‌ మంగ‌ళ‌వారం నాడు పుతిన్ వైఖ‌రిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఉక్రెయిన్‌పై దండెత్తడానికి ముందు పుతిన్ వేసుకున్న లెక్క‌ల‌న్నీ త‌ప్పాయ‌ని ఆయన వ్యాఖ్యానించారు. 

భారీ ఆయుధ సంప‌త్తి క‌లిగిన రష్యా దండెత్తితే.. ఉక్రెయిన్ ఈజీగానే లొంగిపోతుంద‌ని పుతిన్ భావించార‌ని జాన్స‌న్‌ అన్నారు. అయితే పుతిన్ ఊహించ‌న‌ట్లుగా ర‌ష్యా బ‌ల‌గాల‌ను ఉక్రెయిన్ స‌మ‌ర్థ‌వంతంగానే తిప్పికొట్టింద‌ని, ఉక్రెయిన్ నుంచి ఈ త‌ర‌హా అడ్డ‌గింత‌ను పుతిన్ అస్స‌లు ఊహించి ఉండ‌ర‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇక పాశ్చాత్య దేశాల ఐక్య‌త‌ను కూడా పుతిన్ త‌క్కువ‌గా అంచ‌నా వేశార‌ని, ఇప్పుడు ఆ పాశ్చాత్య దేశాల ఆంక్ష‌ల‌తో పుతిన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నార‌ని జాన్స‌న్‌ అన్నారు.


More Telugu News