యుద్ధం ఎఫెక్ట్... రష్యాకు కార్ల ఎగుమతిని నిలిపేసిన జేఎల్ఆర్
- టాటా మోటార్స్ అనుబంధ సంస్థగా జేఎల్ఆర్
- బ్రిటన్ వేదికగా లగ్జరీ కార్ల ఉత్పత్తి
- యుద్ధం కారణంగానే డెలివరీని నిలిపేస్తున్నట్లు వెల్లడి
ఉక్రెయిన్ వంటి చిన్న దేశంపై యుద్ధోన్మాదంతో పేట్రేగిపోతున్న రష్యాపై దాదాపుగా అన్ని విషయాల్లోనూ అంతర్జాతీయంగా ఆంక్షలు పడిపోతున్నాయి. ఇప్పటికే రష్యాపై అమెరికా, యూరోపియన్ యూనియన్ సహా ఇంకా చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్) కూడా రష్యాపై తనదైన శైలి ఆంక్షలకు తెర తీసింది.
యుద్ధం నేపథ్యంలో ఇకపై రష్యాకు తమ కార్ల ఎగుమతిని నిలిపివేస్తున్నట్లుగా జాగ్వార్ ల్యాండ్ రోవర్ మంగళవారం నాడు సంచలన ప్రకటన చేసింది. భారత్‌కు చెందిన టాటా మోటార్స్‌కు అనుబంధంగా బ్రిటన్‌లో లగ్జరీ కార్లను తయారు చేస్తున్న సంస్థే జేఎల్ఆర్. ప్రస్తుత పరిస్థితులు వాణిజ్య సవాళ్లను విసురుతున్నాయని, ఈ కారణంగా రష్యన్ మార్కెట్లలోకి తమ వాహనాల డెలివరీని నిలుపుదల చేస్తున్నట్లుగా జేఎల్ఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది.