హీరోగా వస్తున్న గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి
- వారాహి చలన చిత్రం ద్వారా ఎంట్రీ
- దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు, సెంథిల్ కుమార్ కెమెరా
- 4న బెంగళూరులో గ్రాండ్‌గా ప్రారంభం
- దర్శకుడిగా కన్నడ యువ దర్శకుడు రాధాకృష్ణ
కన్నడ రాజకీయాలను శాసించి.. బళ్లారి ప్రాంతంలో తిరుగు లేని నేతగా ఎదిగి.. అక్రమ మైనింగ్ కారణంగా అవినీతి ముద్ర వేయించుకుని దాదాపుగా అజ్ఞాత వాసం చేస్తున్న కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి ఇప్పుడో వార్త హల్ చల్ చేస్తోంది. గాలి కుమారుడు కిరీటి హీరోగా తెర ముందుకు రానున్నాడన్నదే ఆ వార్త సారాంశం. లెక్కలేనంత సంపదను వెనకేసిన గాలి జనార్దన్ రెడ్డి కుమార్తె పెళ్లి ఏ రేంజిలో జరిగిందో మనకు తెలిసిందే. అదే రీతిలో ఇప్పుడు గాలి కుమారుడి తెరగేంట్రం కూడా ఓ రేంజిలో ఉండబోతోంది.
టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాతగా ఎదిగిన సాయి కొర్రపాటి తన వారాహి సంస్థ ద్వారా గాలి కిరీటిని హీరోగా పరిచయం చేస్తున్నారట. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కన్నడ నాట సూపర్ హిట్ అయిన 'మాయాబజార్' చిత్రానికి దర్శకత్వం వహించిన యువ దర్శకుడు రాధాకృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇక సంగీతంలో తనకంటూ ఓ బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేసుకున్న దేవీశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తారు. బాహుబలి చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన సెంథిల్ కుమార్ ఈ చిత్రానికి కెమెరామన్‌గా పనిచేస్తారట.
స్టంట్స్ విషయానికి వస్తే.. పీటర్ హెయిన్స్ సేవలు గాలి కిరీటి చిత్రానికి అందనున్నాయి. ఈ నెల 4న బెంగళూరులో అట్టహాసంగా గాలి కిరీటి చిత్రం గ్రాండ్‌గా ప్రారంభం కానుందట. తెలుగుతో పాటు కన్నడలోనూ ఒకేసారి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచన రాగానే దానిపైనే దృష్టి సారించిన కిరీటి స్వదేశంతో పాటు విదేశాల్లోనూ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడట. మొత్తంగా ఓ రేంజిలో సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న గాలి కిరీటి ఏ మేర జనాలను మెప్పిస్తారో చూడాలి.