హీరో నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ 'ఎడ్డీ'... వివరాలు ఇవిగో!
- గత 14 ఏళ్లుగా విద్యుత్ వాహన రంగంలో హీరో
- ఇప్పటికే పలు మోడళ్ల విక్రయం
- తాజాగా లో స్పీడ్ స్కూటర్ కు రూపకల్పన
- రెండు రంగుల్లో వస్తున్న ఎడ్డీ
దేశీయ ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో తన ఎలక్ట్రిక్ స్కూటర్ల పోర్ట్ ఫోలియోలో కొత్త మోడల్ ను చేర్చింది. తాజా మోడల్ కు ఎడ్డీ అని నామకరణం చేసింది. హీరో సంస్థ ఇప్పటికే ఫ్లాష్, ఎట్రియా, ఆప్టిమా, ఎన్ వైఎక్స్, ఫోటాన్ మోడళ్లను విక్రయిస్తోంది. ఈ జాబితాలో ఎడ్డీ కూడా చేరింది. హీరో ఎడ్డీ త్వరలోనే భారత రోడ్లపై పరుగులు తీయనుంది. దీని ఎక్స్ షోరూం ధర రూ.72 వేలు. యెల్లో, లైట్ బ్లూ కలర్స్ లో ఇది లభ్యమవుతుంది.
ముఖ్యమైన విషయం ఏమిటంటే, హీరో ఎడ్డీకి లైసెన్స్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ అవసరంలేదు. ఇది లో స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ అని, గంటకు 25 కిమీ వేగంతో వెళుతుందని హీరో ఎలక్ట్రిక్ సంస్థ వెల్లడించింది. స్వల్ప దూరాలు ప్రయాణించే వారిని దృష్టిలో ఉంచుకుని ఎడ్డీకి రూపకల్పన చేసినట్టు తెలిపింది.
టెక్ ఫీచర్లకు ఇందులో కొదవలేదు. ఫైండ్ మై బైక్, ఈ-లాక్ వంటి సాంకేతిక సదుపాయాలున్నాయి. విశాలమైన బూట్ స్పేస్, ఫాలో మీ లైట్స్ దీని ప్రత్యేకత. అంతేకాదు, హీరో ఎడ్డీలో రివర్స్ మోడ్ కూడా ఉంది.
హీరో మోటార్స్ విద్యుత్ వాహనాల విభాగమే హీరో ఎలక్ట్రిక్. హీరో ఎలక్ట్రిక్ సంస్థకు దేశవ్యాప్తంగా 750 సేల్స్, సర్వీస్ అవుట్ లెట్లు ఉన్నాయి. విస్తృతస్థాయిలో చార్జింగ్ పాయింట్లు, తక్షణ సహాయం అందించే రోడ్ సైడ్ ఎలక్ట్రిక్ వెహికిల్ మెకానిక్ లు హీరో ఎలక్ట్రిక్ అందుబాటులో ఉంచుతోంది. దేశవ్యాప్తంగా హీరో ఎలక్ట్రిక్ వాహనాలు 4.5 లక్షల వరకు ఉంటాయి.