రష్యా దాడిలో భారత విద్యార్థి మృతి
- వైద్య విద్య కోసం ఉక్రెయిన్‌కు నవీన్
- ఖర్కీవ్‌లో ఉంటూ మెడిసిన్ చదువుతున్న వైనం
- మంగళవారం ఉదయం ఖర్కీవ్‌పై రష్యా దాడులు
- ఈ దాడుల్లోనే నవీన్ మృతి
- ధ్రువీకరించిన భారత విదేశాంగ శాఖ
ఉక్రెయిన్‌పై యుద్ధోన్మాదంతో పేట్రేగిపోతున్న రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా మరణిస్తున్నారు. ఇరు దేశాల యుద్ధం మొదలై మంగళవారం నాటికి ఆరు రోజులు అవుతుండగా.. మంగళవారం ఉదయం ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడుల్లో భారత్‌కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. మృతి చెందిన విద్యార్థిని కర్ణాటకకు చెందిన నవీన్‌గా గుర్తించారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది.
వైద్య విద్య కోసం భారత్‌కు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉక్రెయిన్‌కు వెళుతున్న సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలకు చెందిన చాలా మంది విద్యార్థులు కూడా వైద్య విద్యనభ్యసించేందుకే ఉక్రెయిన్ వెళ్లిన సంగతీ విదితమే. వైద్య విద్య కోసమే నవీన్ కూడా ఉక్రెయిన్ వెళ్లాడట. అయితే మంగళవారం ఉదయం రష్యా సేనలు జరిపిన కాల్పుల్లో నవీన్ మృతి చెందాడు.