వైఎస్ వివేకా హత్యకు స్కెచ్ జగన్‌దే అని అర్థమవుతోంది: నారా లోకేశ్
- అవినాశ్ రెడ్డి, శివశంకరరెడ్డిలు రెండు కళ్లు అన్నారు
- సీబీఐకి అప్పగిస్తే 12వ కేసు అవుతుందన్నారు
- వీటిని బట్టి చూస్తే స్కెచ్ ఎవరు వేశారో తెలియదా? అంటున్న లోకేశ్
- జగన్‌ను సీబీఐ విచారించాలని లోకేశ్ డిమాండ్
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకు స్వయంగా జగనే స్కెచ్ వేశారని లోకేశ్ ఆరోపించారు. వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు సీఎం జగన్‌ను విచారించాలని ఆయన డిమాండ్ చేశారు.
వైఎస్ వివేకా హత్య కేసులో గొడ్డలి పోటు నుంచి గుండెపోటు డ్రామా వరకూ ఉన్న మిస్టరీ వీడిపోయిందని లోకేశ్ వ్యాఖ్యానించారు. వివేకాను ఆయనకు వరసకు సోదరుడి కుమారుడు, కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి.. మరో వ్యక్తి శివశంకర్ రెడ్డితో కలిసి అత్యంత కిరాతకంగా చంపేశారని కూడా లోకేశ్ ఆరోపించారు.
వివేకాను చంపేసిన అవినాశ్ రెడ్డి, శివశంకర్‌రెడ్డిలు తనకు రెండు కళ్లు అంటూ జగన్ వ్యాఖ్యానించడం, కేసును సీబీఐకి అప్పగిస్తే అది 12వ కేసు అవుతుందని వివేకా కూతురు సునీతతో జగన్ చెప్పడం చూస్తుంటే.. వివేకా హత్యకు స్కెచ్ వేసింది జగనేనని అర్థమవుతోందని లోకేశ్ అన్నారు.