విజయ్ దేవరకొండతో పెళ్లి వార్తలపై తొలిసారిగా స్పందించిన రష్మిక మందన్న

విజయ్ దేవరకొండతో పెళ్లి వార్తలపై తొలిసారిగా స్పందించిన రష్మిక మందన్న
  • పెళ్లి వార్తలు నా దృష్టికి కూడా వచ్చాయి
  • ఇలాంటి పుకార్లు నాకు కొత్తేమీ కాదు
  • వీటిని పట్టించుకునే సమయం కూడా నాకు లేదు

టాలీవుడ్ క్రేజీ హీరో, హీరోయిన్లు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న డేటింగ్ లో ఉన్నారనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఇటీవల కాలంలో వీరు జంటగా బయట కూడా కనిపించడంతో ఈ వార్తలకు మరింత బలమొచ్చింది. ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు షికారు చేస్తున్నాయి. బాలీవుడ్ మీడియా సైతం ఈ అంశానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై విజయ్ దేవరకొండ స్పందించాడు. ఇదొక పనికిమాలిన వార్త అని అన్నాడు. తాజాగా రష్మిక కూడా ఈ అంశంపై స్పందించింది. 

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ఆ వార్తలు తన దృష్టికి కూడా వచ్చాయని, ఇలాంటి పుకార్లు తనకు కొత్తేమీ కాదని తెలిపింది. ఇలాంటి వార్తలను విని నవ్వుకోవడం అలవాటయిందని చెప్పింది. వీటిని పట్టించుకునే సమయం కూడా తనకు లేదని తెలిపింది. 

మరోవైపు రష్మిక వ్యాఖ్యలపై నెటిజన్లు మరో విధంగా స్పందిస్తున్నారు. మీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా లేకపోయినప్పటికీ... మీరిద్దరూ ముంబైకి ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తున్నారు. మీతో పాటు ఇతర సెలబ్రిటీలు కూడా ఎవరూ లేరు కదా? అని ప్రశ్నిస్తున్నారు.


More Telugu News