బడ్జెట్ ను అంకెల గారడీగా మార్చిన వైసీపీ సర్కార్: దేవినేని ఉమ
- కేటాయించిన వాటికి చెల్లింపులు చేయట్లేదు
- లేని ప్రతిపాదనలకు అసెంబ్లీ ఆమోదం లేకుండానే చెల్లింపులు
- కాంట్రాక్టర్లకు లక్షన్నర కోట్ల రూపాయల బకాయిలన్న దేవినేని ఉమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు తీవ్ర విమర్శలు గుప్పించారు. త్వరలో ఏపీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తుత్తి బడ్జెట్ పేరుతో 'ఆంధ్రజ్యోతి'లో వచ్చిన ఓ కథనాన్ని దేవినేని ఉమ పోస్ట్ చేశారు.
2022-23 బడ్జెట్‌పై వైసీపీ సర్కారు కసరత్తు చేస్తోందని, శాఖల వారీగా మొక్కుబడి సమావేశాలు పెడుతోందని ఆ కథనంలో పేర్కొన్నారు. కేవలం భారీ బడ్జెట్ పేరుతో అంకెల బడ్జెట్ రూపొందించడం కోసం ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపాదనలు చేస్తున్నారని అందులో తెలిపారు. మూడేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోందని పేర్కొన్నారు. కాంట్రాక్టర్లకూ బిల్లులు చెల్లించడం లేదని తెలిపారు. ఆయా అంశాలను దేవినేని ఉమ ప్రస్తావించారు.
'బడ్జెట్ ను అంకెల గారడీగా మార్చిన వైసీపీ సర్కార్.. కేటాయించిన వాటికి చెల్లింపులు చేయట్లేదు, లేని ప్రతిపాదనలకు అసెంబ్లీ ఆమోదం లేకుండానే చెల్లింపులు చేస్తుంది. గత మూడు బడ్జెట్లకు సంబంధించి కాంట్రాక్టర్లకు లక్షన్నర కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. 34 నెలల్లో చేసిన అప్పులు, చెల్లింపులపై శ్వేతపత్రం విడుదలచేసే ధైర్యం ఉందా?' అని దేవినేని ఉమ ప్రశ్నించారు.