2022 సంవత్సరానికి హెచ్1బీ కోటా ఫుల్!
- 2022 సెప్టెంబర్ చివరికి కోటా 65,000
- దీనికి అదనంగా అమెరికాలో చదివిన వారికి 20,000
- ఈ రెండు కోటాలకు పూర్తి స్థాయిలో పిటిషన్లు
- ఎంపిక కాని వారికి సమాచారం అందజేత
2022 ఆర్థిక సంవత్సరానికి హెచ్1బీ వీసాల కోసం పూర్తి స్థాయిలో పిటిషన్లు వచ్చినట్టు ‘యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్’ (యూఎస్సీఐఎస్) ప్రకటించింది. 2021 అక్టోబర్ నుంచి 2022 సెప్టెంబర్ తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 65,000 హెచ్1బీ వీసాల పరిమితిని అమెరికా కాంగ్రెస్ నిర్ణయించింది. దీంతో పూర్తి కోటా మేరకు పిటిషన్లు వచ్చేశాయి.
హెచ్1బీ అనేది నాన్ ఇమ్మిగ్రెంట్ వీసా. అత్యధిక నైపుణ్యాలు కలిగిన విదేశీ ఉద్యోగులను ఈ వీసాపై నియమించుకునేందుకు అనుమతి ఉంటుంది. భారత ఐటీ ఉద్యోగులకు హెచ్1బీ వీసాయే ఆధారం. భారత్ సహా అన్ని దేశాల ఉద్యోగార్థులకు ఇది ఎంతో కీలకమైనది. అమెరికా కాంగ్రెస్ నిర్దేశించిన పరిమితి మేరకు 65,000 హెచ్1బీ వీసాలను మంజూరు చేసేందుకు అవకాశం ఉంది. అలాగే, మరో 20,000 వీసాలను ఈ కోటాకు అదనంగా.. అమెరికాలో మాస్టర్ డిగ్రీ, ఇతర ఉన్నత విద్య పూర్తి చేసిన వారికి ఇస్తారు.
ఈ రెండు కోటాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పిటిషన్లు అందుకున్నట్టు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. ఎంపిక కాని వారికి ఆన్ లైన్ లో సమాచారం ఇచ్చినట్టు పేర్కొంది. ఇక ప్రస్తుతం యూఎస్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు సంబంధించి హెచ్1బీ వీసా పిటిషన్లను ఈ కోటాతో సంబంధం లేకుండా అనుమతించడంతోపాటు, ప్రాసెస్ చేస్తామని తెలిపింది.