పాకిస్థాన్ నుంచి నీ భర్త తిరిగి వస్తాడనే అనుకుంటున్నావా?: ఆసీస్ ఆటగాడి భార్యకు బెదిరింపులు
- వన్డే, టెస్టు, టీ20 సిరీస్ కోసం పాక్‌లో ల్యాండైన ఆసీస్ జట్టు
- ఆస్టన్ అగర్ భార్యకు బెదిరింపు మెసేజ్
- అగర్‌ను మా వాళ్లు చంపేస్తారన్న ఆగంతుకుడు
- ఫేక్ ఖాతా నుంచి వచ్చినట్టు గుర్తింపు
పాకిస్థాన్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా జట్టు ఆల్‌రౌండర్ ఆస్టన్ అగర్ భార్యకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బెదిరింపులు వచ్చాయి. అగర్‌ను చంపేస్తామని, పాకిస్థాన్ నుంచి అతడు తిరిగి ఇంటికి వస్తాడని అనుకోవద్దని హెచ్చరించారు. దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత కంగారూ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటిస్తోంది. ఇలాంటి సమయంలో ఈ బెదిరింపులు ఆసీస్ జట్టును కలవరపెడుతున్నాయి.
ఆస్టన్ అగర్ భార్య మెడ్‌లీన్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పలకరించిన గుర్తు తెలియని వ్యక్తి.. ‘మీరు బాగున్నారనే అనుకుంటున్నా. అయితే, మీకో చిన్న హెచ్చరిక చేయాలనుకుంటున్నా. మీ భర్త అగర్ పాక్ పర్యటనకు వస్తే కనుక తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లడం కష్టమే. అతడు ఈ పర్యటనకు వస్తే మీ పిల్లలు తండ్రిని కోల్పోతారు. మా వాళ్లు మీ భర్తను చంపేస్తారు’ అని హెచ్చరించాడు.
ఆ మెసేజ్ చూసి భయభ్రాంతులకు గురైన మెడ్‌లీన్ ఆ బెదిరింపు మెసేజ్‌ను ఆస్ట్రేలియా, పాకిస్థాన్ క్రికెట్ బోర్డుల దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన భద్రతా అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. దీంతో ఆ బెదిరింపు ఫేక్ అని తేలింది. ఓ నకిలీ ఖాతా నుంచి అది వచ్చినట్టు గుర్తించారు. ఎవరో కావాలనే ఈ మెసేజ్‌లు పంపారని నిర్ధారించారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, పాక్ పర్యటనలో ఆస్ట్రేలియా మూడు టెస్టులు, మూడు వన్డేలు, ఓ టీ20 మ్యాచ్‌లో తలపడుతుంది. ఈ సిరీస్ ఈ నెల 4న ప్రారంభమై ఏప్రిల్ 5న ముగుస్తుంది.