సీఎం బర్త్‌డే నాడు పుట్టే పిల్లలకు గోల్డ్ రింగ్ ఇస్తారట
- మార్చి 1న తమిళనాడు సీఎం స్టాలిన్ జన్మదినం
- తిరువళ్లూరు జిల్లా పరిధిలోని సర్కారీ దవాఖానాల్లో జన్మించే శిశువులకు కానుక
- డీఎంకే తిరువళ్లూరు జిల్లా కన్వీనర్ భూపతి ప్రకటన
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సాదాసీదాగా ఉంటారు. హంగూ ఆర్భాటాలేమీ పెద్దగా ఉండవు. అయితే ఆయన పార్టీ నేతలు మాత్రం పేదలకు సాయం చేసే విషయంలో భారీ ప్రకటనలు గుప్పిస్తున్నారు. రేపు (మార్చి 1) స్టాలిన్ బర్త్ డే. దీంతో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని డీఎంకే నేతలు నిర్ణయించుకున్నారు. పనిలో పనిగా ఆ పార్టీకి చెందిన తిరువళ్లూరు జిల్లా కన్వీనర్ మరో అడుగు ముందుకేసి.. స్టాలిన్ జన్మించిన మార్చిన 1న జన్మించే పిల్లలకు ఏకంగా బంగారు ఉంగరాలను బహూకరిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు.
అయితే జిల్లా పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే పిల్లలకే ఈ గోల్డ్ రింగులు ఇస్తానని ఆయన ఓ కండీషన్ పెట్టారు. తిరువళ్లూరు జిల్లా పరిధిలోని తిరుత్తణిలో సోమవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో డీఎంకే జిల్లా కన్వీనర్ భూపతి గోల్డ్ రింగుల విషయాన్ని ప్రకటించారు. సీఎం జన్మదినం రోజున భారీగా వేడుకలు నిర్వహించడంతో పాటుగా పేదలకు చేతనయినంత మేర సాయం చేయాలని భూపతి తన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.