ర‌ష్యా దూకుడు.. 36 దేశాల విమానాల‌పై నిషేధం

  • ఆర్థిక ఆంక్ష‌ల‌కు ప్ర‌తిగా పుతిన్ ప్రతీకార చర్య ‌
  • ర‌ష్యా నిషేధిత దేశాల్లో బ్రిట‌న్‌, జ‌ర్మ‌నీ, ఇట‌లీ, కెన‌డా, ఫ్రాన్స్‌
  • పాశ్చాత్య దేశాల హెచ్చ‌రిక‌ల‌కు వెర‌వ‌ని పుతిన్‌
ఉక్రెయిన్‌పై యుద్ధోన్మాదంతో విరుచుకుప‌డిన ర‌ష్యా.. పాశ్చాత్య దేశాల హెచ్చరిక‌ల‌కు ఏమాత్రం భ‌య‌ప‌డ‌టం లేదు. ఇప్ప‌టికే అగ్ర‌రాజ్యం అమెరికాతో పాటు యూరోపియ‌న్ యూనియ‌న్‌, నాటో కూట‌మి దేశాలు ర‌ష్యాపై ఆర్థిక‌ప‌ర‌మైన ఆంక్ష‌లు విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఆంక్ష‌ల నేప‌థ్యంలో కాస్తంత త‌గ్గిన‌ట్టే క‌నిపించిన ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌.. తాజాగా మ‌రింత క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్నారు. త‌మ దేశంపై ఆంక్ష‌లు విధించిన దేశాల్లోని మెజారిటీ దేశాల విమానాలు ర‌ష్యా గ‌గ‌న‌త‌లంపై ఎగ‌ర‌కుండా నిషేధం విధించారు. 

ర‌ష్యా నిషేధం విధించిన దేశాల్లో బ్రిట‌న్‌, జ‌ర్మ‌నీ, ఆస్ట్రియా, అల్బేనియం, బెల్జియం, బ‌ల్గేరియా, హంగేరీ, డెన్మార్క్‌, ఐర్లాండ్, స్పెయిన్‌, ఇటలీ, కెన‌డా, లాథ్వియా, లిథువేనియా, లక్సెంబ‌ర్గ్‌, రొమేనియా, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, క్రొయేషియా, స్వీడ‌న్‌, ఎస్టోనియా త‌దిత‌ర దేశాలున్నాయి.


More Telugu News