ఢిల్లీ చేరిన ఆరో విమానం.. ఇప్పటిదాకా 1,396 మంది భారత్‌కు చేరిక
- ఢిల్లీకి చేరుకున్న ఆరో విమానం
- 240 మందితో రాక
- ఉక్రెయిన్‌లోని భారతీయులందరినీ తరలించేదాకా 'ఆపరేషన్ గంగ'
రష్యాతో యుద్ధం కారణంగా భీతావహ వాతావరణం నెలకొన్న ఉక్రెయిన్‌లోని బారతీయుల తరలింపు కోసం భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ గంగ నిర్విరామంగా కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం దాకా ఉక్రెయిన్‌లోని భారతీయులతో 5 విమానాలు భారత్ చేరగా.. కాసేపటి క్రితం ఆరో విమానం కూడా ఢిల్లీ చేరింది.
సోమవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న విమానంలో 240 మంది భారతీయులు దేశం చేరుకోగా.. ఇప్పటిదాకా ఉక్రెయిన్ నుంచి సురక్షితంగా భారత్ చేరుకున్న వారి సంఖ్య 1,396కు చేరుకుంది. తాజాగా మోదీ ఆదేశాలతో కేంద్ర మంత్రివర్గంలోని నలుగురు మంత్రులు ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు చేరుకుంటున్నారు. దీంతో ఉక్రెయిన్‌లోని భారతీయులను దేశానికి తరలించే పని మరింత సులువు కానుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.