గ‌వ‌ర్న‌ర్‌తో భేటీ కానున్న సీఎం జ‌గ‌న్‌

  • కాసేప‌ట్లో రాజ్ భ‌వ‌న్‌కు సీఎం జ‌గ‌న్‌
  • అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల నేప‌థ్యంలో భేటీకి ప్రాధాన్యం
  • ఎమ్మెల్సీ ఉప ఎన్నిక‌పైనా చ‌ర్చించే అవ‌కాశం
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రికాసేప‌ట్లో గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్‌తో ప్ర‌త్యేకంగా భేటీ కానున్నారు. ఈ మేర‌కు విజ‌య‌వాడ‌లోని రాజ్ భ‌వ‌న్‌కు సీఎం జ‌గ‌న్ బ‌య‌లుదేర‌నున్నారు. మార్చి 7 నుంచి అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు ప్రారంభం కానుండ‌టం, అదే రోజున శాస‌న‌మండ‌లిలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానానికి జ‌ర‌గ‌నున్న ఉప ఎన్నిక‌కు నోటిఫికేష‌న్ రానున్న నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్‌తో జ‌గ‌న్ భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది.

సాధార‌ణంగా ఏ కీల‌క ప‌రిణామం సంద‌ర్భంగా అయినా సీఎం జ‌గ‌న్ నేరుగా రాజ్ భ‌వ‌న్ వెళ్లి, గ‌వ‌ర్న‌ర్ హ‌రిచంద‌న్‌తో భేటీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల ప్రారంభానికి ముందు మ‌రోమారు జ‌గ‌న్ రాజ్ భ‌వ‌న్ కు వెళుతుండ‌టంతో గ‌వ‌ర్న‌ర్‌తో సీఎం భేటీపై ఆస‌క్తి నెల‌కొంది.


More Telugu News