బ్రెస్ట్ ఇంప్లాంట్స్ సర్జరీ చేయించుకోమని నాకు ఒకరు సలహా ఇచ్చారు: దీపికా పదుకుణే
- 18 ఏళ్ల వయసులోనే మోడలింగ్ లో అడుగుపెట్టా
- తొలి రోజుల్లో చాలా మంది ఉచిత సలహాలు ఇచ్చేవారు
- షారుఖ్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానన్న దీపిక
మోడల్ గా గ్లామర్ రంగంలో కెరీర్ ను ప్రారంభించి, ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి అగ్ర హీరోయిన్ స్థాయికి దీపికా పదుకుణే చేరుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తొలినాళ్లలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. 18 ఏళ్ల వయసులోనే తాను మోడలింగ్ లో అడుగుపెట్టానని చెప్పింది. ఆ రోజుల్లో తనకు ఉచిత సలహాలు ఇచ్చేవారు చాలా మంది ఉండేవారని తెలిపింది.
ఒకరోజు ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి బ్రెస్ట్ ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవాలని చెప్పాడని... అయితే ఆ విషయాన్ని తాను పట్టించుకోలేదని చెప్పింది. బాలీవుడ్ లో తన తొలి చిత్రమైన 'ఓం శాంతి ఓం' ను షారుఖ్ తో కలిసి చేశానని దీపిక తెలిపింది. షారుఖ్ తనకు ఎన్నో సలహాలు ఇచ్చారని చెప్పింది. ఆయన నుంచి తాను ఎన్నో నేర్చుకున్నానని, ఆయన ఇచ్చిన సలహాలను తాను ఇప్పటికీ ఫాలో అవుతుంటానని చెప్పింది.